రాష్ట్రీయం

తిరుపతిలో మాదకద్రవ్యాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 29: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతికి నిషేధిత మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయా? అన్న అనుమానాలు పొడచూపుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మంగళవారం హైదరాబాదులో టాస్క్ఫోర్స్, మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేసిన డ్రగ్స్ ముఠాలో తిరుపతికి చెందిన కేశవ అనే యువకుడు పట్టుబడటంతో అనుమానాలు బలపడ్డాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని దర్శించడానికి ప్రతినిత్యం లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివస్తారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఉండటంతో ఇతర వాణిజ్య కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి.
దీంతో మరో లక్షమందికి పైగా ప్రతినిత్యం వివిధ వర్గాల వారు జిల్లాకు వస్తుంటారు. అయితే ఇప్పటివరకు మద్యం, గంజాయి, ఎరైజర్ వంటి మత్తుపదార్థాలను సేవిస్తూ పట్టుబడ్డవారు కోకొల్లలు. ముఖ్యంగా తిరుపతి రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లలో మహిళల నుంచి యువకుల వరకు ఈ మత్తుపదార్థాలను సేవిస్తున్నారు. గతంలో ఒకమారు తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద మాదకద్రవ్యాలు కలిగి ఉన్న విదేశీయులను ప్రత్యేక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత మాదకద్రవ్యాల మాట తిరుపతిలో వినపడలేదు. తాజాగా మంగళవారం తిరుపతికి చెందిన యువకుడు ఎపిడ్రిన్ డ్రగ్‌ను విక్రయించే ముఠాలో పట్టుబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాదులో పట్టుబడ్డ కేశవ తిరుపతి, చిత్తూరుల్లో మత్తుపదార్థాలను విక్రయించడం కానీ లేదా ఇతనికి సహకరిస్తున్నవారు కానీ ఎవరైనా ఉన్నారేమోనని పోలీసులు విచారిస్తున్నారు.