రాష్ట్రీయం

చిన్న ఆలయాలకు నిత్య పూజా నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చిన్న దేవాలయాలు, ఆదాయం అంతగా లేని దేవాలయాలకు ‘నిత్య పూజా నిధి’ ఏర్పాటు చేయాలని ఆలయ పరిరక్షణ ఉద్యమ సమితి కన్వీనర్ డాక్టర్ ఎంవి సౌందరరాజన్ కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ, ధర్మ రక్షణ కోసం ప్రధాని చేస్తున్న కృషిని అభినందించారు. చిన్న ఆలయాలకు పూజా నిధి ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటూ ఇందుకు అనుగుణంగా సుప్రీంకోర్టు చేసిన సిఫారసులను అమలు చేయాలని కోరారు. చిలుకూరు ఆలయంలో నిత్యపూజా నిధిని ఏర్పాటు చేయ గా, భక్తులు స్పం దించి 10 కోట్లరూపాయలను విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఇదే తరహాలో అన్ని దేవాలయాలకు నిత్యపూజా ఫండ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి సునిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.