రాష్ట్రీయం

సూర్యనారాయణ సేవలు అసామాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రముఖ్, 93ఏళ్ల సైద్ధాంతికవేత్త దివంగత కె సూర్యనారాయణ సేవలు అనన్యసామాన్యమని సంఘ్ నేతలు ఘనంగా కొనియాడారు. గత 19వ తేదీన బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన సూర్యనారాయణకు సంతాపంగా ఆర్‌ఎస్‌ఎస్ నేతలు మంగళవారం నాడిక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యనారాయణ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సూర్యనారాయణ మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు వౌనం పాటించారు. సూర్యనారాయణ కన్నుమూతతో సంఘ్ పరివార్ పెద్దదిక్కును కోల్పోయినట్టయిందని సంయుక్త ప్రధానకార్యదర్శి వి భాగయ్య పేర్కొన్నారు. స్వయంసేవకులకు తండ్రిలా బోధించి, గురువులా శిక్షణ ఇచ్చేవారని, వారి జీవితం అమరమైనదని, జ్వలిస్తూ జ్వాలగా మారిపోయారని అన్నారు. ఆఖరి రోజు వరకూ ఆయన ప్రసన్నమైన పరాక్రమమైన జీవితాన్ని కొనసాగించారని, పవిత్రంగా, నిర్మలంగా జీవించారని చెప్పారు.
సంఘ్ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూనే మరో పక్క సంఘటనను విస్తరణ చేసేవారని, క్లిష్టమైన సమయాల్లోనూ సంయమనంతో ఉండేవారని, తరతరాలను ప్రభావితం చేశారని భాగయ్య పేర్కొన్నారు. ఆయన ధ్యేయం, ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ్ ప్రాంత సంచాలకుడు పేటా వెంకటేశ్వరరావు, క్షేత్ర ప్రచారకులు శ్యాంకుమార్, జస్టిస్ సి వి రాములు, విశ్వహిందూ పరిషత్ నేత గోపాల్, లింగం సుధాకర్‌రెడ్డి, జస్టిస్ పర్వతరావు, వయక్తిక్ గీత్ సహా పలువురు సంఘ్ నేతలు పాల్గొన్నారు. ద్వారా స్వయం సేవక్ కార్యకర్తలకు గత 70 సంవత్సరాల పాటు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌కు పలు హోదాల్లో సేవలు అందించారని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. 1924 ఆగస్టు 20న కృష్ణప్ప, సుందరమ్మ దంపతులకు సూర్యనారాయణ జన్మించారని గోపాల్ చెప్పారు. 1942లో విద్యార్థి దశలోనే ఆయన ఆర్‌ఎస్‌ఎస్ పట్ల ఆకర్షితులై అందులో చేరారని, 1946లో బిఎస్సీ పూర్తి కాగానే ఆయన ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా నియమితులయ్యారని పేర్కొన్నారు. కర్ణాటక నుండి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన తొలి ముగ్గురు ప్రచారక్‌లలో సూర్యనారాయణ ఒకరని అన్నారు. సూర్యనారాయణ అఖిల భారతీయ సేవా ప్రముఖ్‌గా కూడా చాలా కాలం పనిచేశారని జస్టిస్ పర్వతరావు చెప్పారు.
కర్ణాటక విభాగ్ ప్రముఖ్‌గా, తమిళనాడు ప్రాంతీయ ప్రచారక్‌గా తర్వాత దక్షిణాది రాష్ట్రాల క్షేత్ర ప్రచారక్‌గా పనిచేశారని జస్టిస్ సి వి రాములు చెప్పారు. అమెరికా, ట్రినిడాడ్, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, హాలండ్, నార్వే, కెన్యా, మలేసియా, సింగపూర్, నేపాల్ తదితర దేశాలలో ఆయన పర్యటించారని శ్యాంకుమార్ నివాళులు అర్పించారు. విశ్వ హిందూ పరిషత్, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, ఆరోగ్య భారతి, సేవా భారతి తదితర ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలతో చాలా సన్నిహితంగా ఉంటూ సేవలు అందించారని, కన్ను మూసేనాటికి ఆయన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నారని అన్నారు. 1969లో కర్ణాటకలోని ఉడిపిలో సంత్ సమ్మేళన్‌ను దిగ్విజయంగా నిర్వహించి అందరి దృష్టినీ ఆయన ఆకర్షించారని చెప్పారు.

చిత్రం..సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి
నివాళి అర్పిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ఫ్రధాన కార్యదర్శి భాగయ్య