రాష్ట్రీయం

ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 29: కిడ్నీ దాతలను సైతం మోసం చేసే ఘరానా మోసగాడిని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి వన్‌టౌన్ సిఐ సీతయ్య మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన హనిఫ్‌షాన్ అనే వ్యక్తి మూత్రపిండాల దానం పేరిట ఘరానా మోసానికి పాల్పడుతూ పట్టుపడ్డాడని తెలిపారు. కిడ్నీ దానం పేరిట ఓ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి కిడ్నీలు అత్యవసరంగా కావాలంటూ ప్రకటనలు చేస్తుంటాడు.
అయితే డబ్బుకు ఆశపడి, మూత్రపిండాలను దానం చేసేందుకు ముందుకు వచ్చేవారిని ఇతగాడు సంప్రదించేవాడని తెలిపారు. అయితే కిడ్నీలు అవసరమున్నవారు, వాటిని దానం చేసేందుకు ముందుకు వచ్చిన వారితో ముందుగా కొన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేయాలంటూ అందుకు కొంత నగదు తమ ఖాతాలో జమ చేయాలంటూ సూచించి ఆ డబ్బు ఖాతాలో పడ్డాకా తర్వాత కనిపించకుండా పోయేవాడు. ఇదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వల్లబ్‌నగర్‌కు చెందిన కిరణ్‌కుమార్ ఫేస్‌బుక్ ద్వారా హనిఫ్‌షాన్‌ను సంప్రదించాడు. కిడ్నీ దానం చేస్తే లక్షల రూపాయాలు వస్తాయని ఆశ చూపాడు. దాంతో కిరణ్ తన తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. అయితే కిరణ్‌కుమార్ మాత్రం వైజాగ్‌లో ఉపాధి కోసం ఉద్యోగ శిక్షణకు వెళ్తున్నానని, తనకు రూ.10 వేలు కావాలంటూ తన తల్లిదండ్రులకు తెలిపారు. అయితే తమ పిల్లాడు ఉద్యోగం కోసం అడిగిన డబ్బు ఇవ్వడంతో హనిఫ్‌షాన్ ఖాతాలో జమ చేశాడు. అయితే ఈ నెల 24వ తేదీన తాను శిక్షణకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి తిరుపతికి బయలుదేరాడు. కానీ కిరణ్‌కుమార్ తన దగ్గర ఉండే సెల్‌ఫోన్‌ను మాత్రం ఇంట్లో మరిచిపోయాడు. కాగా, రెండు, మూడు రోజుల తర్వాత తల్లిదండ్రులకు ఎలాంటి ఫోన్ రాకపోవడంతో ఆందోళన చెందినవారు ఇంటిదగ్గర మరిచిపోయిన పోన్‌లోని నంబర్ల ఆధారంగా హనిఫ్‌షాన్‌కు పోన్ చేశారు. అయితే ఆయన మాత్రం మీ పిల్లాడు ఉద్యోగ శిక్షణకు రాలేదని కిడ్నీ ఇచ్చేందుకు వచ్చాడని తెలపడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. మీ పిల్లాడు మీదగ్గరకు రావాలంటే తనకు కొంత డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దాంతో కిరణ్‌కుమార్ తల్లిదండ్రులు మహబూబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గుంతకల్‌లో హనిఫ్‌షాన్ అరెస్టు చేశారు. దాంతో ఆయన నిజస్వరూపం బయటపడిందని, మోసగాడు డాక్టర్ ఆనంద్‌గా చలామణి అవుతూ కిడ్నీల పేరిట అమాయక ప్రజల నుండి డబ్బులు దండుకునే పని చేస్తున్నాడని అరెస్టు చేసిన నిందితుడిని మహబూబ్‌నగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ సీతయ్య తెలిపారు. ఈ మేరకు ఎస్సీ రమా రాజేశ్వరి సైతం కిడ్నీల పేరిట మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.