రాష్ట్రీయం

తేలని కృష్ణా జలాల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: తెలంగాణ, ఆంధ్రల మధ్య కృష్ణా జలాల వినియోగంపై చర్చించేందుకు, ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేందుకు బుధవారం ఇక్కడ జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య సమావేశం ఎలాంటి పరిష్కార మార్గాలు కనుక్కోలేకపోయంది. పోతిరెడ్డిపాడు నుంచి 53 టిఎంసి శ్రీశైలం జలాలను మాత్రమే వినియోగించుకున్నామని ఆంధ్ర ప్రకటించగా, 61 టిఎంసి ఏపీ తరలించుకుపోయిందని తెలంగాణ ఆరోపించింది. ఈ అంశంపై ఖచ్చితమైన లెక్కలు లేకపోవడంతో కృష్ణా బోర్డు పరిష్కారమార్గాన్ని సూచించలేకపోయంది. తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణాపరీవాహక ప్రాంతాల్లో ఉన్న చిన్ననీటి వనరుల ద్వారా తెలంగాణ ఇప్పటికే 89.15 టిఎంసి నీటిని వాడుకున్నదని ఏపీ వాదించగా, తాము కేవలం 29 టిఎంసి నీటిని మాత్రమే వాడుకున్నామని తెలంగాణ అంటోంది. దాంతో ఈ అంశంపైనా బోర్డు ఒక నిర్ణయానికి రాలేకపోయింది. పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ 52 టిఎంసిల నీటిని వినియోగించుకున్నదని, అందువల్ల ఆ నీటిలో తమ వాటా ఏమిటో తేల్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ మూడు అంశాలపై స్పష్టత రాకపోవడంతో రబీ పంటల వినియోగం కోసం కృష్ణా జలాల కేటాయింపుపై బుధవారం సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. రబీ పంటలకు కృష్ణా జలాలను 103 టిఎంసి కేటాయించాలంటూ తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అయితే తెలంగాణకు కేవలం 28 టిఎంసి నీటిని మాత్రమే కేటాయించాలని, తమకు 145.90 టిఎంసి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. ఈ అంశంపై బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో అవగాహన కుదరలేదు. మళ్లీ త్వరలో మరో పర్యాయం సమావేశం కావాలని నిర్ణయించారు.