రాష్ట్రీయం

మళ్లీ విద్యుత్ చార్జీల మోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ఆంధ్రాలో వరుసగా మూడోసారి విద్యుత్ చార్జీలను వడ్డించేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపి డిస్కాంలు మొత్తం రూ.7177 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు రెవెన్యూ లోటుపై ప్రతిపాదనలను ఏపి డిస్కాం విద్యుత్ అధికారులు బుధవారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి)కి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలను విశే్లషిస్తే 2017-18లో కూడా విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమని ఖాయమైంది. కాని ఏ మేరకు వడ్డన ఉంటుందో ఏపిఇఆర్‌సి ఖరారు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదికి సంబంధించి వార్షిక రెవెన్యూ అవసరాలపై మాత్రమే బుధవారం విద్యుత్ డిస్కాం అధికారులు ఏపిఇఆర్‌సికి ప్రతిపాదనలు ఇచ్చారు. కొత్త టారిఫ్ ప్రతిపాదనలను వచ్చే నెలలో మండలికి సమర్పించనున్నారు. రూ.7177 కోట్లలో రాష్ట్రప్రభుత్వం కనీసం రూ.4 వేల కోట్లను విద్యుత్ సబ్సిడీ రూపంలో అందించినా రూ. 3177 కోట్ల లోటు మిగిలి ఉంటుంది. కాగా ఏపిఇఆర్‌సి అంతర్గత సామర్ధ్యం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచిస్తూ విద్యుత్ చార్జీల భారాన్ని వెయ్యి కోట్ల రూపాయల లోపే ఖరారు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ప్రతిపాదనలపై ఏపిఇఆర్‌సి బహిరంగ విచారణ నిర్వహించి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. పెంచిన చార్జీల భారం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.
2017-18 సంవత్సరానికి మొత్తం రూ.30,069 కోట్ల రెవెన్యూ అవసరమని, టారిఫ్ ద్వారా రూ.22,7892 కోట్ల ఆదాయం వస్తుందని ఏపి డిస్కాంలు అంచనా వేశాయి. మొత్తం రెవెన్యూలోటును రూ. 7177 కోట్లని చూపించారు. ఒక యూనిట్ విద్యుత్ వ్యయం రూ.5.94పైసలని, కాని రూ.4.53 పైసలు వసూలవుతోంది. ఒక యూనిట్ విద్యుత్‌పై రూ.1.42 పైసలు లోటు వస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 66,948 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉండగా, విద్యుత్ అవసరాలు 57,018 ఎంయు అని, మిగులు విద్యుత్ 10930 ఎంయు ఉందని ఏపి డిస్కాంలు పేర్కొన్నాయి. మిగులు విద్యుత్‌లో 2208 ఎంయును విక్రయించనున్నారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూ.5.94 పైసలు ఉంటే, వచ్చే ఏడాది ఈ భారం మరో 65పైసలు పెరగనుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఏపి డిస్కాంల పరిధిలో ఉన్న ఆర్‌టిపిపి-4 ఆరు వందల మెగావాట్ల విద్యుత్, కృష్ణపట్నం 1600 మెగావాట్లు, హిందుజా 1020 మెగావాట్ల విద్యుత్ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకే వినియోగించనున్నారు. సౌర విద్యుత్ ద్వారా 1250 మెగావాట్లు, 1586 మెగావాట్ల పవన విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానమవుతుంది. వ్యవసాయానికి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.