రాష్ట్రీయం

జాడలేని ధార్మిక పరిషత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3 : దేవాలయాల నిర్వహణకు సంబంధించి ‘్ధర్మిక పరిషత్’ ఏర్పాటుపై ఉభయ రాష్ట్రాల్లో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తారా లేదా అన్న చర్చ ప్రజల్లో ప్రారంభమైంది. ధార్మిక పరిషత్ ఏర్పాటు అయినట్టే అన్న భావన ఉభయ ప్రభుత్వాలు గత ఏడాది నుండి కల్పిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఏడాదిన్నర గడిచినప్పటికీ అధికారికంగా ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. తెలంగాణకు సంబంధించి ధార్మిక పరిషత్ ఏర్పాటుపై శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. శనివారం రాత్రి ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గ సమావేశం వివరాలను మీడియాకు చేసిన బ్రీఫింగ్‌లో ప్రస్తావనకు రాలేదు. ధార్మిక పరిషత్ ఫైలును త్వరగా తనకు పంపించాలంటూ మంత్రివర్గ సమావేశంలో అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దేవాదాయ, ధర్మాదాయ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి తీరిక లేకుండా ఉండటం వల్ల ఫైలు సిద్ధంచేసేందుకు వారం, పదిరోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ నుండి శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ శబరిమలైలో ప్రత్యేక భవనం నిర్మించే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం స్థల పరిశీలన ఇతర అంశాలపై అధ్యయనం కోసం ఒక అధికారిక బృందం ఈ నెల 6 న కేరళ వెళుతోంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. అందువల్ల ఈ బృందం తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ధార్మిక పరిషత్ అంశంపై మంత్రి దృష్టి కేంద్రీకరిస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. దేవాదాయ మంత్రిత్వ శాఖ నుండి ఫైలు తన వద్దకు రాగానే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. అందువల్ల త్వరలో తెలంగాణ ధార్మిక పరిషత్ ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇలాఉండగా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆరు నెలల క్రితమే ధార్మిక పరిషత్ సభ్యుల పేర్లను సిఫారసు చేస్తూ సంబంధిత మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఒక ఫైలును ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారని తెలిసింది. ఈ పరిషత్‌లో సభ్యుల పేర్లను చేర్చడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి మాణిక్యాలరావు మధ్య అవగాహన కుదరలేదని తెలిసింది. బిజెపికి చెందిన మాణిక్యాలరావుపై పార్టీపరంగా ఉన్న వత్తిడితో ఆయన కొన్ని పేర్లను పొందుపరచగా, యథాతథంగా ఆమోదించేందుకు చంద్రబాబు సిద్ధంగా లేకపోవడంతో పరిస్థితిలో పురోగతి లేదని తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధార్మిక పరిషత్ ఏర్పటుకోసం చట్టం తీసుకువచ్చారు. దేవాలయాల నిర్వహణలో ఎండోమెంట్స్ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు, మానిటర్ చేసేందుకు వీలుగా, దేవాలయాలు పూర్తి స్వేచ్ఛతో ఉండేలా ధార్మికపరిషత్ ఏర్పాటు చేయాలని చట్టం తీసుకువచ్చారు. 2007 లో ఈ చట్టంరాగా ఇప్పటి వరకు రెండు పర్యాయాలే ధార్మిక పరిషత్తు ఏర్పాటైంది. సమాజంలోని హిందూధర్మానికి చేయూత ఇస్తున్న వివిధ రంగాల నిపుణులతో ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే రెండు పర్యాయాలు ఏర్పాటైన ధార్మిక పరిషత్తులు పూర్థి స్థాయిలోపనిచేసే అవకాశం లభించలేదు. నామమాత్రంగానే ఇవి కొనసాగాయి.
ప్రస్తుతం తెలంగాణ, ఎపి రెండు రాష్ట్రాల్లో ధార్మిక పరిషత్ అవసరం ఎంతో ఉంది. దేవాలయాల నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించే అవకాశం కేవలం ధార్మిక పరిషత్‌కే ఉంటుంది. ఈ పరిస్థితిలో ఉభయ రాష్ట్రాల్లోనూ ధార్మిక పరిషత్ ఎప్పుడు ఏర్పాటవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.