ఆంధ్రప్రదేశ్‌

వణుకుతున్న లంబసింగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెం కొత్తవీధి, నవంబర్ 30: విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతున్నాయి. ఆంధ్రా కాశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగిలో బుధవారం నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చింతపల్లిలో ఏడు, గూడెంకొత్తవీధిలో ఐదు డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లో గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడంలేదు. ఉదయం 10 గంటల వరకు మంచుతెరలు వీడటంలేదు. రహదారులపై పట్టపగలే లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఉదయం విధులకు వెళ్ళే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. పొగమంచు చలితీవ్రత ఉన్నప్పటికీ పర్యాటకుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. కార్తీకమాసం ముగియడంతో చాలామంది పర్యాటకులు వనభోజనాలు తాకిడి ఆంధ్రా కాశ్మీరుగా పేరుగాంచిన లంబసింగిలో పెరిగింది. ఉదయం పూట అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఉన్ని దుస్తులు వాడాలని ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

భయపెడుతున్న ‘నాడా’

చెన్నైకి ఆగ్నేయంగా తుపాను
మత్స్యకారులు అప్రమత్తం
2వ నెంబర్ ప్రమాద సూచి జారీ

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 30: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం సాయంత్రం తుపానుగా మారింది. దీనికి ‘నాడా’గా పేరు పెట్టారు. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంగా నాడా కేంద్రీకృతమై ఉన్నట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు. నాడా తుపాను పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 2 నాటికి పుదుచ్చేరి సమీపంలోని కడలూరు వద్ద తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో డిసెంబర్ 2,3 తేదీల్లో ఒక మోస్తలు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నాడా తుపాను నేపథ్యంలో అన్ని ప్రధాన పోర్టుల్లోను 2వ నెంబర్ ప్రమాద సూచీని ఎగురవేశారు. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని తుపాను కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.