రాష్ట్రీయం

బ్యానర్ల కింద ప్రెషర్ బాంబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 1: విప్లవ కారిడార్‌లో పిఎల్‌జిఏ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు కొత్త తరహా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. నేటి నుంచి 8వరకు పిఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. విప్లవకారిడార్ రాజధానిగా చెప్పుకునే ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం సరిహద్దున ఉన్న జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ వద్ద పిఎల్‌జీఏ వారోత్సవాలు విజయవంతం చేయాలని బ్యానర్లు, వాల్‌పోస్టర్లు వదిలిన మావోయిస్టులు వాటి కింద ప్రెషర్ బాంబులు పెట్టారు. వెంకటాపురానికి చెందిన కార్తీక్ అనే ఆటో డ్రైవర్ వాటిని తొలగిస్తున్న క్రమంలో ఆ బాంబు పేలి గురువారం ఉదయం తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో, వెంకటాపురం మండలం ఆలుబాక, విజయపురికాలనీ తదితర ప్రాంతాల్లో కూడా వాల్‌పోస్టర్లు వదిలారు. శబరి, చర్ల ఏరియా కమిటీల పేరుతో వదిలిన ఈ పోస్టర్లలో పిఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని, భారీ ఎత్తున యువతీ, యువకులు మావోయిస్టు పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బైరంగడ్, మట్వాడ ప్రాంతాల్లో మావోయిస్టులు ఎన్‌హెచ్-63పై బ్యానర్లు కట్టి, వాల్‌పోసర్టర్లు వేశారు. మావోయిస్టులు ఈ ఏడాది కాలంలో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో 120 మందిని కోల్పోయారు. బీజాపూర్, సుక్మా, కొండగావ్, జగదల్‌పూర్, ఏఓబీలో, తాజాగా కేరళ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో అగ్రనేతలను కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలోని కెకెడబ్ల్యు కమిటీ కూడా ఎన్‌కౌంటర్లో హతమైంది. ఈ నేపథ్యంలో వారికి నివాళులు అర్పిస్తూ పిఎల్‌జీఏ వారోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ ఘటనలతో దండకారణ్యంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యుద్దవాతావరణం నెలకొంది. మావోయిస్టుల హెచ్చరికలతో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, హిట్‌లిస్టులో ఉన్న వారంతా గ్రామాలు వదిలి పట్టణాలకు వలస బాట పట్టారు. ఆర్టీసీ కూడా మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. పోలీసుల హెచ్చరికలతో పగటి పూట మాత్రమే సర్వీసులను మారుమూల గ్రామాలకు నడుపుతోంది.