రాష్ట్రీయం

నల్లధనానికి కారణం కాంగ్రెస్సే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: దేశంలో నల్లధనానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి, ఉద్యమాలు చేసిన ఏకైక రాజకీయ పార్టీ బిజెపి అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు పేర్కొన్నారు. నల్లధనంపై యుద్ధం ప్రకటిస్తామని 2009లోనే అద్వానీ ప్రకటించారని, 2011లో భారతదేశం అంతటా నల్లధనానికి వ్యతిరేకంగా అద్వానీ చైతన్య యాత్ర నిర్వహించారని ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటిగ్రిటీ లెక్కల ప్రకారం 92 బిలియన్ డాలర్లు విదేశాలకు తరలివెళ్తోందని తేలిందని, జిడిపిలో 20 శాతానికి పైగా సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోందనే లెక్కలున్నాయని, ఇది ప్రభుత్వ నెట్‌వర్కుకు అందడం లేదని తేలిందని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మొత్తంగా మారడానికి ఎవరు బాధ్యులో ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. నల్లధనం పెరగడానికి, దేశ ఎదుగుదల మీద ప్రభావం పడటానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ నల్లధనం మీద యుద్ధం ప్రకటించలేదని మురళీధరరావు అన్నారు. 1947 తర్వాత ఇంత వరకూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాల్లోకెల్లా చాలా చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. దేశ చరిత్రను సంపూర్ణంగా మార్చే దిశలో అతి పెద్ద సాహసోపేత విధానమని పేర్కొన్నారు. ఇంతకుముందెన్నడూ ఇంత పెద్ద మొత్తంలో 125 కోట్ల ప్రజలను కదిలించిన, ప్రభావితం చేసిన నిర్ణయం ఏదీ లేదని అన్నారు. ఇదేదో అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రధాని మోదీ ఈ విషయం చెబుతూ వస్తున్నారని అన్నారు. నల్లధనం ఏ రూపంలో ఉన్నా దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రధాని చెప్పారని, దానిని కూడా అరికట్టాల్సి ఉంటుందని అన్నారు. ప్రధాని నిర్ణయాల వల్ల పేద వారికి ఎలాంటి ఇబ్బందీ లేదని, నల్లధనం దాచుకున్న వారికే ఇబ్బంది అవుతోందని అన్నారు. దేశంలో ప్రజలు అంతా నగదు రహిత లావాదేవీలు చేయాలని, దేశంలో ధరలు తగ్గాలంటే నల్లధనాన్ని అరికట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నల్లధనం లేని రోజున బీదలు, బడుగు వర్గాల వారికి నిత్యావసరాల ధరలు తగ్గితీరుతాయని అన్నారు. దేశంలో నకిలీ నోట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని, వీటిని అరికట్టడంలో కేంద్రానికి రాష్ట్రాలు సైతం సహకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాని పోరుకు సహకరించని ఏ రాజకీయ పార్టీనీ ప్రజలు క్షమించబోరని అన్నారు. అలాగే బినామీ స్థలాలపై కూడా పోరు తప్పదని మురళీధరరావు వివరించారు. 50 రోజుల పాటు చిన్నచిన్న సమస్యలున్నా, నల్లధనం తొలగించిన రోజున అసలైన ప్రయోజనం పేదలకే అందుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో టాక్స్ నెట్‌లోకి చాలా మంది వస్తారని, దాని వల్ల రెవిన్యూ పెరుగుతుందని ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మంచి సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీనివల్ల దేశంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్‌రెడ్డి, కుమార్, రాములు తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.