ఆంధ్రప్రదేశ్‌

సింగరేణి కాలరీస్‌లో జీతాల చెల్లింపునకు ఏర్పాట్లు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: సింగరేణి కాలరీస్‌లోని ఉద్యోగులకు జీతాల చెల్లింపునకు బ్యాంకు మేనేజర్లను సంప్రదించి ఉద్యోగులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి కాలరీస్‌లోని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు సింగరేణి డైరెక్టర్ జె పవిత్రన్ కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సింగరేణి అధికారులతో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల చెల్లింపులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి బ్యాంక్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులు బ్యాంక్ అధికారుల సమన్వయానికి ప్రతి బ్యాంక్ ఒక సింగరేణి అధికారిని కేటాయించాలని, క్యూ పద్దతి పాటించేలా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని డైరెక్టర్ పవిత్రన్ కుమార్ అధికారులను ఆదేశించారు.