ఆంధ్రప్రదేశ్‌

ఐటి అధికారి ఇంట్లో అక్రమ ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: హైదరాబాద్‌లో ఓ ఆదాయపు పన్నుశాఖ అధికారి ఇంటిపై సిబిఐ అధికారులు గురువారం సాయంత్రం మెరుపుదాడులు జరిపారు. నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఐటి శాఖ అధికారి బొడ్డు వెంకటేశ్వరరావు ఇంటితోపాటు ఆయన సమీప బంధువులకు చెందిన నాలుగు ఇళ్లల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపి, ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించారు. వెంకటేశ్వరరావుతన కుమారుల పేరిట ఇటీవల సప్తవర్ణ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి భారీగా డబ్బు సంపాదించినట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల ఆయన కుమారుడిని హీరోగా పెట్టి సినిమా కూడా తీస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, నగరశివారుల్లో 15 ప్రాంతాల్లో స్థిరాస్తులు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ. 40 కోట్లకు పైగా ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇదిలావుండగా వెంకటేశ్వరరావుకు సంబంధించి ఇంకా సోదాలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా సోదాలు నిర్వహించనున్నట్టు సమాచారం.

టిడిపి ఆరిపోయిన దీపం
* టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణలో టిడిపి ఆరిపోయిన దీపం అని, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఒకసారి జైలులో చిప్పకూడు తిన్నాడని, తన పద్ధతి మార్చుకోక పోతే మరోసారి అతను చిప్పకూడు తినక తప్పదని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మల్యే గాదరి కిశోర్ అన్నారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.