ఆంధ్రప్రదేశ్‌

ఎఎండి డైరెక్టర్‌గా నందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చి (ఎఎండి) డైరెక్టర్‌గా ఎల్ కె నందా గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ ఎ కె రాయ్ పదవీ విరమణ అనంతరం ఈ పదవిని స్వీకరించిన నందా ప్రస్తుతం హెచ్ ప్లస్ స్థాయి సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతదేశ పరమాణు శక్తి కార్యక్రమానికి అవసరమైన యురోనియమ్ , థోరియం తదితరు అటామిక్ పరమాణు సంబంధ ఖనిజాల విషయంలో మొత్తం మీద ప్రణాళిక రచన, పర్యవేక్షణ, మార్గదర్శకత్వం అమలు వంటి విధులను నిర్వహిస్తారు. ఇంతకుముందు ఆయన ఎఎండి అదనపు డైరెక్టర్‌గా సేవలు అందించారు. ఖరగ్‌పూర్ ఐఐటి నుండి అప్లయిడ్ జియాలజీ లో స్నాతకోత్తర పట్టా పొందిన నందాకు ఖనిజాల అనే్వషణ, పరిశోధనల్లో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.

రేపటి నుంచి అవినీతి నిరోధక వారోత్సవాలు
* జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు..్ఫర్యాదుదారులకు సత్కారం
* అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 1: అంతర్జాతీయ అవినీతి నిరోధక శాఖ దినం సందర్భంగా ఈనెల 3నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అవినీతి నిరోధక శాఖ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్ తెలిపారు. ఈ వారోత్సవాలలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, యువకులచే ర్యాలీలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏసిబికి ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులను సత్కరించాలని ఆయన సూచించారు. హైస్కూల్, కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులచే అవినీతిపై వ్యాస రచన పోటీలను నిర్వహించి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయాలని, అవినీతిపై బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కరపత్రాలను పంపిణీ చేయాలని ఏసిబి డైరెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెం. 1064కు ఫిర్యాదు చేయవచ్చని వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని కూడా ఎసిబి డైరెక్టర్ సూచించారు.