ఆంధ్రప్రదేశ్‌

మార్కెట్ విలువపై ఏం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: భూమి సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసే ముందు మార్కెట్ విలువను జిల్లా కలెక్టర్లు నిర్ధారించేందుకు తీసుకుంటున్న చర్యలపై వచ్చే మంగళవారం లోపల అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిల్‌ను మాజీ ఎమ్మెల్యే ఎ కోదండరెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అనంతరం ఈకేసు విచారణను వాయిదా వేశారు.