ఆంధ్రప్రదేశ్‌

నగదు కేటాయింపులపై ఆర్‌బిఐ స్పష్టత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రాలకు ఆర్‌బిఐ కేటాయిస్తున్న నగదు, తదితర అంశాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని నీతి ఆయోగ్ నియమించిన కమిటీ కన్వీనర్ కూడా అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయ పడ్డారు. దేశంలో డిజిటల్ చెల్లింపుపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నీతి ఆయోగ్ ఏర్పాటా చేయడం తెలిసిందే. ఈ కమిటీ కన్వీనర్ హోదాలో విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఆయన కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొన్ని బ్యాంక్‌లు తమ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయన్నారు. ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాంక్‌లు ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. నగదు రహిత లావాదేవీల కోసం కమిటీ సభ్యుల సలహాలను కోరారు. నోట్ల రద్దు తరువాత రాష్ట్రంలో తీసుకున్న చర్యల గురించి వివరించారు. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల గురించి వివరించారు. నగదు రహిత లావాదేవీల కోసం ఇతర దేశాల్లో తీసుకుంటున్న చర్యలు, దేశంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై వివరించారు. మరింతగా చర్చించేందుకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.