రాష్ట్రీయం

డబ్బొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 2:బ్యాంకుల్లో, ఏటిఎంలలో నగదు లేక అల్లాడుతున్న ప్రజలకు ఓ శుభవార్త. రాష్ట్రానికి ఆర్‌బిఐ 2,420 కోట్ల రూపాయల నగదును అందించింది. ఆర్‌బిఐ ఇలా విడుదల చేసిందే తడవు రాష్ట్ర ప్రభుత్వం ఆ నగదును యుద్ధప్రాతిపదికన విమానాల్లో వివిధ ప్రాంతాలకు తరలించి, తక్షణమే ఆ నగదు బ్యాంకుల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిన్ననోట్లు, కొత్తనోట్ల కోసం ప్రజల్లో నెలకొన్న ఆందోళన నివారించి, బ్యాంకులు, ఏటిఎంలలో సరిపడ డబ్బు సమకూర్చేందుకు ఏపి సీఎం చంద్రబాబునాయుడు సంక్షోభం మొదలయిన తొలిరోజు నుంచీ సమీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ సమస్య పరిష్కరించేందుకు కేంద్రం ఆయన చైర్మన్‌గా సబ్ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాబు అభ్యర్థనకు స్పందించిన ఆర్‌బిఐ గవర్నర్, రాష్ట్రానికి 2420 కోట్ల రూపాయలు పంపేందుకు అంగీకరించారు. దానితో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లను అర్ధరాత్రి వరకూ సమీక్షించిన బాబు జిల్లాలవారీగా బ్యాంకు అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి చర్చించారు. శుక్రవారం మధ్యాహ్నానికల్లా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆర్‌బిఐ పంపే నోట్లను ఎలా పంపిణీ చేయాలన్న దానిపై సీరియస్‌గా చర్చించారు.
సాధారణంగా అయితే ఆర్‌బిఐ పంపే కంటైనర్లు చివరి జిల్లాకు చేరాలంటే కనీసం రెండురోజులు పడుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళం, కడప, నెల్లూరు వంటి జిల్లాలకు హైదరాబాద్ నుంచి కంటైనర్ల ద్వారా డబ్బు పోవాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా పదింతలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అయితే సమయం సరిపోక, ఒత్తిడి మరింత పెరుగుతుందని గ్రహించిన బాబు తక్షణమే రెండు ప్రత్యేక విమానాలను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటుచేసి, విమానాశ్రయాలకు చేర్చాలని నిర్ణయించారు.
అక్కడినుంచి పెద్ద వాహనాల ద్వారా జిల్లాలకు చేర్చాలని రోడ్‌మ్యాప్ ఖరారు చేశారు. దానికోసం ప్రత్యేకించి ఆర్‌బిఐ పంపిన అధికారులు, పోలీసులతో చర్చలు జరిపే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్‌కు అప్పగించారు. ఆయన అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామువరకూ పురోగతిని సమీక్షించారు. ఫలితంగా శుక్రవారం నాటికి తిరుపతి, విశాఖ ప్రత్యేక విమానాల ద్వారా నగదు చేరి, అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా జిల్లాలకు చేర్చారు. ఈ నగదు పంపిణీని సాధారణ, మధ్య, పెద్దస్థాయి నగరాలుగా విభజించి 160 నుంచి 240 కోట్ల వరకూ పంపిణీ చేశారు. తాము ప్రత్యేక విమానాల్లో పంపిన ఈ నగదును సకాలంలో బ్యాంకులకు చేర్చినందువల్ల బ్యాంకు ఉద్యోగులు ప్రజల కోసం ఓవర్‌టైం పనిచేసేలా చూడాలని బాబు ఆర్‌బిఐని అభ్యర్థించారు. రెండోకంటికి తెలియకుండా గురువారం అర్థరాత్రి నుంచి మొదలైన ఈ ‘ఆపరేషన్ మనీ’ శుక్రవారం మధ్యాహ్నానికల్లా బ్యాంకులకు చేరడంతో ముగిసింది.

చిత్రం..హైదరాబాద్ నుంచి నగదుతో రేణిగుంట ఎయర్‌పోర్ట్‌కు చేరుకున్న ట్రూ జెట్ విమానం