రాష్ట్రీయం

కరవుతీరా డబ్బు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: డబ్బుకోసం కటకటలాడుతున్న తెలంగాణకు ఒక్కసారి ఉక్కిరిబిక్కిరియ్యేంత మొత్తం అందుతోంది. కేంద్రం నుంచి మొత్తంగా 3600 కోట్లు వచ్చిపడ్డాయి. వీటిలో 18 వందల కోట్ల ఆర్బీఐ నుంచి తెలంగాణలోని బ్యాంకులకు అందితే, కేంద్రం నుంచి పన్ను వాటాగా మరో 18 వందల కోట్లు రాష్ట్రానికి అందాయి. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రంలోని జనం పడుతున్న ఇబ్బందులు నేపథ్యంలో, ఆర్బీఐ నుంచి వచ్చి 18 వందల కోట్లను ఆగమేఘాల మీద జిల్లాల్లోని బ్యాంకుల తరలింపు ప్రక్రియ సాగుతోంది. ఇక సాధారణంగా ప్రతి నెలా రాష్ట్రానికి 997 కోట్లు కేంద్రం పన్నుల వాటా అందిస్తుంది. గత నెల ఇవ్వాల్సిన మొత్తంలో 500 కోట్లమేర కేంద్రం కోత పెట్టింది. దీనిపై ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసినపుడు రాష్ట్ర పరిస్థితిని నివేదించారు. మొత్తంగా సిఎం కెసిఆర్ ప్రయత్నాలు ఫలించడంతో గత నెల కోత విధించిన 500 కోట్లు, ఈనెల వాటా 997 కోట్లు, ఇతర బకాయిలు కలిపి మొత్తం కేంద్రం నుంచి 18 వందల కోట్లు విడుదల చేస్తున్నట్టు రాష్ట్రానికి వర్తమానం అందింది. దీంతో అటు కరెన్సీ కష్టాలు, ఇటు నిధుల ఇబ్బంది చాలావరకూ తీరినట్టేనని అధికారులు అంటున్నారు.
ఆర్బీఐ తెలంగాణకు 18 వందల కోట్ల రూపాయల కొత్త కరెన్సీని పంపించింది. ఆర్థిక శాఖ అధికారులు ఈ విషయం స్పష్టం చేశారు. నోట్ల రద్దు తరువాత రాష్ట్రంలో పరిస్థితిపై ఆర్థిక శాఖ అధికారులు ప్రతి రోజూ సమీక్ష జరుపుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆర్బీఐ కరెన్సీ పంపుతోంది. అందులో భాగంగా తెలంగాణకు శుక్రవారం 18 వందల కోట్ల కొత్త కరెన్సీని పంపించినట్టు అర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నగరంకన్నా జిల్లాల్లో కరెన్సీ ఇబ్బందులు అధికంగా ఉండటంతో, ఆగమేఘాల మీద కొత్త కరెన్సీలో ఎక్కువ భాగాన్ని జిల్లాల్లోని బ్యాంకులకు పంపిస్తున్నారు. ఈ కరెన్సీ వల్ల కొత్త కరెన్సీ కొరత కొంతవరకు పరిష్కారం అవుతుందని అధికారులు అంటున్నారు. నగదు పంపించిన విషయాన్ని గురువారం ఆర్థిక శాఖ అధికారులకు ఆర్బీఐ సమాచారం అందించింది. శుక్రవారం నగరానికి చేరిన కరెన్సీని జిల్లాలకు పంపించే ప్రక్రియ మొదలెట్టారు. నిజానికి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైనా, మొదటి జీతాన్ని తీసుకోలేని పరిస్థితి కనిపించింది. 1నాటికే బ్యాంకుల్లో కరెన్సీ ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరినా, సాధ్యం కాలేదు. అయితే ఒకరోజు ఆలస్యంగా కరెన్సీ నగరానికి వచ్చింది. కొత్త కరెన్సీ శనివారం నుంచీ జిల్లాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.