రాష్ట్రీయం

విద్యుత్ సౌధలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: తమ డిమాండ్లను తక్షణమే ఆమోదించి అమలు చేయాలని కోరుతూ ఏపిఎస్‌ఇబి అసిస్టెంట్ ఇంజనీర్లు శుక్రవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో ఏపి ట్రాన్స్‌కో సిఎండి చాంబర్ ముందు బైఠాయించారు. పదోన్నతుల విషయంలో విద్యుత్ సంస్థల యజమాన్యం న్యాయం చేయడంలో విఫలమైందని ఏపిఎస్‌ఇబి అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఎన్ కిరణ్‌కుమార్ అన్నారు. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు సిఎండి కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో అసిస్టెంట్ ఇంజనీర్లు శాంతించారు. ఎంఎస్ నెం 354ను రద్దు చేయాలని, నేరుగా నియమితులైన ఇంజనీర్లకు పదోన్నతులు ఇవ్వాలని, తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్‌చేసిన 1253 మంది ఉద్యోగులను ఆదుకోవాలని ఆయన కోరారు.