రాష్ట్రీయం

ఆంధ్ర అధికారుల గైర్హాజర్‌తో కృష్ణాబోర్డు సమావేశం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: రబీ సీజన్‌లో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నీటి పంపిణీపై చర్చించడానికి శుక్రవారం సమావేశం కావాల్సిన కృష్ణా నీటి యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఇరు రాష్ట్రాల నీటి పంపకాలపై నిర్ణయం తీసుకోవడానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌లు సభ్యులుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం జరగాల్సిన త్రిసభ్య సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్‌రావు గైర్హాజర్ కావడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణా బోర్డు బుధవారం సమావేశమైనప్పటికీ ఇందులో నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో శుక్రవారం తిరిగి సమావేశం కావాలని నిర్ణయించింది. అయితే ఈ సమావేశానికి రావడానికి తమకు వీలుపడలేదని మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇఎన్‌సి కోరడంతో వాయిదా వేసినట్టు కృష్ణా బోర్డు వర్గాలు తెలిపాయి.