రాష్ట్రీయం

జూనియర్ కాలేజీలుగా గురుకులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లు అన్నింటినీ జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి వసతులున్న చోట జూనియర్ కాలేజీలను ప్రారంభిస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ , మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ లీడర్స్ మీట్ 2016నును కడియం శ్రీహరి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంభించారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవని కొనియాడారు. తెలంగాణ విద్యార్థులను ప్రపంచంలో ఏ పరీక్షనైనా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని, ఆ మేరకు మన పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని కడియం శ్రీహరి కోరారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లలో ప్రవేశం దొరకాలంటే కష్టతరమయ్యే విధంగా వాటిని తయారుచేయాల్సిన బాధ్యత ప్రిన్సిపాళ్లపై ఉందని అన్నారు. ప్రస్తుతం వౌలిక వసతులు అన్నీ కల్పిస్తున్నామని, ఇక విద్యా ప్రమాణాలు పెంచాల్సిన పని మీ చేతుల్లోనే ఉందని అన్నారు. తెలంగాణ స్కూళ్లు దేశానికే తలమానికం కావాలని ఆకాంక్షించారు. కేవలం మార్కులే గీటురాయిగా కాకుండా ఉత్తమ పౌరులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ సాయంతో విద్యాబోధన చేసేందుకు త్వరలోనే సబ్జెక్టు టీచర్లకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మోడల్ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఖచ్చితంగా నిర్వహించాలని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో బాలికల భద్రతపై ప్రిన్సిపాల్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు, బంధువుల అండర్ టేకింగ్స్ లేకుండా బయటకు పంపవద్దన్నారు. స్కూళ్లను బాయ్‌కాట్ చేయడానికి వస్తే అంగీకరించవద్దని అన్నారు.
వచ్చే రెండేళ్లలో జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల కంటే మిన్నగా మన స్కూళ్లను తీర్చిదిద్దాలని అన్నారు. ప్రస్తుతం వౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి వీటి కల్పన పూర్తవుతుందని అన్నారు. ఆ తర్వాత స్కూళ్లకు ర్యాంకులు ఇచ్చి గ్రేడింగ్‌లు ఇస్తామని చెప్పారు. ఉత్తమ ప్రిన్సిపాళ్లను టీచర్లను సన్మానిస్తామని అన్నారు. ఈ ఏడాది గ్రేడింగ్ ఉండదని, టెన్షన్ పడొద్దని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, రెసిడెన్షియల్ స్కూళ్ల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.