రాష్ట్రీయం

అభాగ్యులకు సౌభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, జనవరి 3: మానసిక వికలాంగులుగా పుట్టిన అభాగ్యులను సౌభాగ్యులుగా మార్చడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ పరిధిలోని సరస్వతినగర్ వద్ద 17 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వికలాంగుల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌తో కలసి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వికలాంగులు ఉపాధి అవకాశాలు పొంది సొంత కాళ్లపై నిలబడేందుకు ఈ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వికలాంగులకు అండగా నిలిచేందుకు మోదీ అనేక పథకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వికలాంగులు స్వయంశక్తితో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల చొరవతో ఇక్కడ సంయుక్త ప్రాంతీయ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు. సంబంధిత కేంద్ర మంత్రి గెహ్లాట్ నిబంధనలు సైతం సడలించి అత్యవసర ప్రాతిపదికన నిధులు కేటాయించారని ఆయన అభినందించారు. అనంతరం కంటేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూబ్ ఆఫ్ టూరిజం, ట్రావెల్స్ మేనేజేమెంట్ (ఐఐటిటిఎం) కళాశాలను కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, తావర్ చంద్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈసందర్భంగా భవన నిర్మాణాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న విద్యార్థులతో ముచ్చటించి పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉద్బోధించారు. అనంతరం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులను అధికారులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, కామినేని శ్రీనివాస్, ఎంపిలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ జానకి, జిల్లా పరిషత్ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.