ఆంధ్రప్రదేశ్‌

గిరిజనుల సంస్కృతి, అస్తిత్వాన్ని పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 3: గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతి, అస్తిత్వాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్ పిలుపునిచ్చారు. గిరిజన హక్కుల పరిరక్షణ, అమలుపై రాష్ట్ర న్యాయ సేవాసాధికారిత సంస్థ సౌజన్యంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల న్యాయ సేవా సాధికారిత సంస్థల సదస్సును ఇక్కడి జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేశారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మాట్లాడుతూ గిరిజనుల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులని, వివిధ అంశాలలో వెనుకబడినవారని పేర్కొన్నారు. వారి అభివృద్ధిపై చర్యలు చేపట్టేముందు అధికారులు గిరిజనుల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ప్రభుత్వాలు కూడా గిరిజన సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరులో గిరిజనులకు తాగేందుకు సురక్షితమైన తాగునీరు లేదని, అధిక కల్తీ కలిగిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని, గిరిజన వసతిగృహాల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా గిరిజన ఆవాసాల్లో వౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. జనాభాలో 10శాతం కంటే తక్కువగా ఉన్న జనాభా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మలగీతాంబ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో 1.64 లక్షలమంది గిరిజనులు ఉన్నారన్నారు. జాతీయ న్యాయసేవాసాధికారిత సంస్థ వివిధ ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు పర్యవేక్షణ దిశగా జిల్లాలో గిరిజన సమస్యలపై దృష్టి సారించిందన్నారు. కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ గిరిజనులు అస్తిత్వాన్ని పరిరక్షించేస్తూనే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో 15 నుండి 20 కుటుంబాలు కలిగిన ఆవాసాలు ఉంటాయని ఆ ప్రాంతానికి వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి దిశగా వివిధ రకాలైన సమస్యలు ఉన్నాయని వాటి నివారణ దిశగా తీర్పులు వెలువడాలని సూచించారు. అటవీ హక్కుల చట్టంపై వివరించారు.

సదస్సులో మాట్లాడుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథ్