రాష్ట్రీయం

బాలయ్య భార్యను సోదా చేసిన ఐటి అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, డిసెంబర్ 3: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరను శనివారం ఐటి శాఖ అధికారులు సోదా చేశారు. శనివారం ఆమె ఆరుగురు కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం స్పైస్‌జెట్‌లో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈసందర్బంగా ఐటి శాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి బాలకృష్ణ సతీమణి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఆమె వద్ద రూ.10 లక్షలు నగదు ఉండటాన్ని గుర్తించారు. విమాన ప్రయాణికులు రూ.2 లక్షలు తీసుకువెళ్లవచ్చన్న నిబంధన ఉండటంతో వసుంధరతోపాటు ఆరుగురు కుటుంబ సభ్యులున్న కారణంగా వారిని వదిలివేశారు. శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినప్పటికి విమానాశ్రయ అధికారులు గోప్యంగా ఉంచారు. అటు తరువాత మీడియాకు ఈవిషయంపై సమాచారం అందింది. వసుంధర శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడానికై హైదరాబాదు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది ఆమె తీసుకొచ్చిన బ్యాగులో డబ్బులు ఉండటాన్ని గుర్తించింది. అయితే అప్పటికే విమానం బయలుదేరాల్సి ఉండటంతో అక్కడ భద్రతా సిబ్బంది రేణిగుంట విమానాశ్రయ అధికారులకు, ఐటి అధికారులకు ఈవిషయమై సమాచారం అందించారు. ఈక్రమంలో ఐటి అధికారి శ్రీనివాసులురెడ్డి అక్కడకు చేరుకుని వారిని సోదా చేశారు. వారు తీసుకువచ్చిన రూ.10 లక్షలకు ఆధారాలు ఉండటంతో వదిలివేశారు. శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించడానికి ఆమె ఆ డబ్బును తీసుకొచ్చి ఉండవచ్చని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు.