రాష్ట్రీయం

మనోడే... మంచోడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: వివిధ శాఖల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న 120 మందికిపైగా అధికారులు, ఉద్యోగులను రాష్ట్రప్రభుత్వం రాజకీయ వత్తిళ్లకు లొంగి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేసింది. ప్రభుత్వ నిధులు మళ్లింపు, అవినీతి, అవకతవకలు, నియమావళిని ఉల్లంఘించడం తదితర అభియోగాలపై అహర్నిశలు కష్టపడి రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రభుత్వానికి ఆధారాలతో సహా నివేదికలు పంపుతూంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 18 నెలల్లో దాదాపు 120 మందికిపైగా అధికారులు, ఉద్యోగులపై నమోదైన ఆరోపణలను కొట్టివేసింది. వారిపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా వదిలేసింది. ఈ మేరకు గత 18 నెలల్లో పలు జీవోలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ చర్య అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ శాఖల్లో చర్చనీయాంశంగా మారింది.
అవినీతిని సహించే ప్రసక్తిలేదని చంద్రబాబు పలు సంచలమైన ప్రకటనలు చేస్తుంటే, మరో వైపు ఆయాశాఖల మంత్రులు ఉన్నతాధికారులపై వత్తిడి తెచ్చి అభియోగాలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై నమోదైన ఆరోపణలను డ్రాప్ చేసే విధంగా, క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా వెనకుండి కథ నడుపుతున్నట్లు సమాచారం. నిధుల వినియోగంలో అవకతవకలకు పాల్పడిన కేసులో ఒక మంత్రివద్ద డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగిపై విజిలెన్స్ శాఖ అభియోగాలను మోపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనికి ఆహార పథకం కార్యక్రమంలో వెలుగు చూసిన ఆరోపణలకు సంబంధించి డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆ అధికారిని లిఖితపూర్వంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 15న జీవో ఇచ్చింది. జీవో జారీతో ఆ ఉద్యోగి అభియోగాల నుంచి బయటపడ్డారు. పనికి ఆహార పథకంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు డివిజనల్ ఇంజనీర్లపై భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. శాఖాపరమైన దర్యాప్తు చేయాల్సి ఉందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఆ జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి వత్తిడి ఫలించి, ప్రభుత్వం ఇద్దరు ఇంజనీర్లపై విచారణను ఆదేశించలేదని సమాచారం. స్వర్ణజయంతి గ్రామ్ స్వరాజ్‌గార్ యోజన ప్రొగ్రాం నిధుల దుర్వినియోగంపై గుంటూరు జిల్లాలో ఒక రెవెన్యూ అధికారిపై ఆరోపణలు వచ్చాయి. ఈ అధికారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ శాఖ సిఫార్సు చేసింది. ఆ అధికారి ప్రభుత్వంలో ఒక మంత్రి వద్ద తన పలుకుబడిని ఉపయోగించి ఆరోపణల నుంచి విముక్తి చెందినట్లు తెలిసింది. రాయలసీమలోని ఒక జిల్లాలో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమంలో కొనుగోళ్ల వ్యవహారంలో ఆరోపణలు వచ్చిన ఒక అధికారి కూడా మంత్రి చలువతో బయటపడ్డారు. రాయలసీమలోనే పులివెందుల బ్రాంచికెనాల్ పనులకు సంబంధించి నిధుల అవకతవకల అభియోగంలో ఇద్దరు సాగునీటి ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ శాఖ సిఫార్సు చేస్తే ఒక మంత్రి ఆశీస్సులతో క్లీన్ చిట్ పొందారు. కాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ శాఖ నివేదిక ఆధారంగా మొబిలైజేషన్ అడ్వాన్సుల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణపై ఒక ఇంజనీర్‌కు ఒక ఏడాది ఇంక్రిమెంట్‌ను మాత్రం నిలిపివేశారు. మొత్తంమీద అవినీతికి పాల్పడిన అధికారులు నేతల అండతో వివాదాల్లోంచి బయటపడుతున్నారు. విజిలెన్స్ శాఖ పంపించిన నివేదికలపై శాఖాపరమైన విచారణ జరిపి అన్నీ సక్రమంగా ఉంటేనే అభియోగాలను ప్రభుత్వం డ్రాప్ చేస్తుంటుందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.