రాష్ట్రీయం

హైదరాబాద్‌లో ఐటి సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3:హైదరాబాద్‌లో ఇండియా సాఫ్ట్ ఐటి ఎగ్జిబిషన్ 2017 నిర్వహించనున్నట్టు ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఫిబ్రవరి 13, 14 తేదీల్లో జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో 75 దేశాల నుంచి 400 అంతర్జాతీయ కొనుగోలుదారు సంస్థలు పాలు పంచుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటి కంపెనీలకు భారత దేశం అగ్రగామి కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. త్వరలోనే ఐటి ఉత్పత్తుల విధానం ప్రకటించనున్నట్టు చెప్పారు. ఐటి రంగానికి మన దేశంలో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇండియా సాఫ్ట్ ఐటి ఎగ్జిబిషన్ 2017 ను హెచ్‌సిసిలో నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలో ఈ సదస్సు నిర్వహించడం ఇది నాలుగోసారి. 250 భారతీయ ఎగుమతిదారు సంస్థలు ఈ సదస్సులో పాల్గొంటాయి. హైదరాబాద్ ఐటి కంపెనీలకు మక్కా లాంటిదని అన్నారు. హైదరాబాద్ నుంచి 60వేల కోట్ల రూపాయల విలువైన ఐటి ఎగుమతి అవుతున్నాయి.