రాష్ట్రీయం

ఎన్‌కౌంటర్ కాదు... ప్రభుత్వ హత్యాకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నాచారం, డిసెంబర్3: ఆంధ్ర, ఒడిసా సరిహద్దు (ఎఓబి) లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ కాదని, ఎన్‌కౌంటర్ పేరిట ప్రభుత్వమే మావోయిస్టులను దారుణంగా హత్య చేసిందని అఖిల భారత విద్యార్థి జెఎసి నిర్ధారించిందని అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. ఓయు లైబ్రరి ఐసిఐసిఆర్ హాల్‌లో జరిగిన విద్యార్థి సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రకాశ్ అంబేద్కర్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, విరసం నేతలు వరవరరావు, కల్యాణ్‌రావు, మున్నా తల్లి శిరిష, గణేశ్ భార్య దమయంతి, ప్రభాకర్ భార్య దేవేంద్ర, దయనిల్ తండ్రి మల్లేశ్వర్‌రావు హాజరయ్యారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆదివాసీల సంపదపైన కనే్నసి బహుళజాతి కంపెనీలకు ప్రభుత్వాలు తొత్తులుగా మారిపోయి, అడ్డుచెప్పిన మావోయిస్టులను బూటకపుఎన్‌కౌంటర్‌లలో కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఓబిలో ఎన్‌కౌంటర్ ఏకపక్షంగా జరిగిందని అఖిల భారత విద్యార్థి బృందం నిర్ధారించిందని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో 11మంది ఆదివాసీ యువకులు తప్పిపోయారని, ఇంతవరకు వారి ఆచూకీ తెలియపరచలేదని డిమాండ్ చేశారు. 2019 నాటికి దేశం ఒక నియంత పాలనలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని, ప్రజాస్వామ్య విలువలకు కాలం చెల్లిపోతూ కార్పొరేట్ పాలన రాబోతోందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు నేటి పాలకవర్గాలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయని తెలిపారు. ఆడవి సంపదను కొల్లగొట్టడానికి ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టులను హత్యలు చేస్తూ ఎన్‌కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.