రాష్ట్రీయం

మొదటికే మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: జాతీయ ప్రవేశ పరీక్షల అవసరాలకు అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాల సిలబస్‌లో తెచ్చిన మార్పు లు మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడే 2004లో ఎన్‌సిఇఆర్‌టికి రాయల్టీ చెల్లించి సిలబస్‌ను తీసుకుని వాటిని ఇంటర్మీడియట్ స్థాయిలో అమలుచేసింది. గణితం మినహా మిగిలిన విజ్ఞాన శాస్త్రాల్లో 10 నుండి 20 శాతం మేర సిలబస్‌లో మార్పు చేసి అమలులోకి తెచ్చారు. జాతీయ స్థాయిలో పనిచేసే సిబ్బందికి, సైన్యం, ఇతర కేంద్ర సర్వీసుల్లో ఉన్న వారి పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని జాతీయ సిలబస్‌ను రూపొందించడం జరిగింది. ఏ రాష్ట్రానికి బదిలీ అయినా చదువుల్లో తేడా ఉండకూడదని ఉమ్మడి సిలబస్ రూపొందించారు. ఈ సిలబస్‌లో అత్యధికంగా జాతీయ ప్రాధాన్య అంశాలే చేర్చారు. అయినా పోటీ పరీక్షల పేరుతో దానిని అమలుచేయడాన్ని విద్యార్థులు సైతం తొలుత స్వాగతించారు. విజ్ఞాన శాస్త్రాల్లో మార్పులు తీసుకురావడంలో అర్థం ఉన్నా, సామాజిక శాస్త్రాల్లోనూ, భాషా శాస్త్రాల్లోనూ, జీవశాస్త్రంలోనూ చేసిన మార్పులు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నచందంగా తయారైంది.
ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకూ సిలబస్‌లో ఎస్‌సిఇఆర్‌టి మా ర్పులు తీసుకువస్తోంది. ఈ మార్పు లు చేసే ముందు కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌ను ప్రాతిపదికగా తీసుకుని సవరణలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. సిబిఎస్‌ఇ సిలబస్‌కు, స్టేట్ బోర్డుల సిలబస్‌కు మధ్య గతంలో తీవ్రమైన అంతరం ఉండేది, దానివల్ల జాతీయ పరీక్షలకు అనుకున్న స్థాయిలో విద్యార్థులు సన్నద్ధం కాలేకపోతున్నారని 2004లో ఎన్‌సిఇఆర్‌టికి రాయల్టీ చెల్లించి రాష్ట్రప్రభుత్వం సిలబస్‌ను కొనుగోలు చేసింది. ఆ సిలబస్‌కు అనుగుణంగా నూతన సిలబస్‌ను, పాఠ్య పుస్తకాలను రూపొందించారు. రాష్ట్రాలు విడిపోవడంతో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యత అంశాలను చేర్చుతూ కొత్త పుస్తకాలను రూపొందించుకోవాలన్న లక్ష్యం అంతగా నెరవేరలేదు. సింగిడి పేరుతో తెలంగాణలో తెలుగు పుస్తకాల్లో స్థానిక కవుల ప్రస్తావన మినహాయిస్తే మిగిలిన వాటిలో దాదాపు పాత సిలబస్‌నే కొనసాగిస్తున్నారు. తెలంగాణ భాషను పాఠ్యపుస్తకాల్లో చేర్చడం మినహా పెద్ద మార్పు రాలేదు. అదే తీరు ఆంధ్రాలోనూ కొనసాగుతోంది. ఈ క్రమంలో జాతీయ స్థాయి సిలబస్‌ను కొన్ని బోధనాశాస్త్రాలకే పరిమితం చేసి స్థానిక అంశాలను చేర్చాల్సిన సమయం ఆసన్నమైందని విద్యార్ధులు కోరుతున్నారు. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో తెలంగాణకే చెందిన విద్యార్థులకు సైతం స్థానిక అంశాలపై ఏ మాత్రం పట్టులేకపోవడం కమిషన్ సభ్యులకు ఆశ్చర్యం కలిగించింది. పాఠ్యపుస్తకాల్లో స్థానిక సమాచారంలో లోపమే దీనికి కారణమని తేలింది.