రాష్ట్రీయం

బంగారం షాపులపై ఐటి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్‌లోని నగల దుకాణాలపై ఆదాయపు పన్నుశాఖ దాడులు నిర్వహిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత అత్యధికంగా బంగారాన్ని అన్మిన పలు షాపుల వివరాలను ఐటి అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు అప్పగించారు. శనివారం నగరంలోని బంజారాహిల్స్, ఆబిడ్స్, పంజాగుట్ట, పాతబస్తీలోని కొన్ని నగల షాపులపై ఐటి అధికారులు మెరుపుదాడులకు దిగారు. పెద్ద నోట్ల రద్దు తరువాత దాదాపు వంద కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు ఐటి అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని ఓ షాపు యజమాని నవంబర్ 11 నుంచి 15 వరకు వంద కోట్ల పాతనోట్లను బ్యాంక్‌లో జమ చేశాడని తెలిసింది. అయితే సిసి కెమెరాల పుటేజీ పరిశీలనలో 50, 60 మంది మాత్రమే బంగారం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే 5వేలకు పైగా లావాదేవీలు జరిగినట్టు రికార్డుల్లో షాపు యజమాని తప్పుడు లెక్కలు చూపాడు. దీంతో ఐటి అధికారులు ఆ షాపు యజమానిపై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు నగరంలోని మరికొన్ని సిసి కెమెరా ఫుటేజీలోని బ్యాంక్ లావాదేవీలను ఐటి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పాతబస్తీలోని బంగారు షాపుల్లో గత మూడు రోజులుగా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ఎక్కువ ధరకు బంగారం కొన్నవారిని సిసి ఫుటేజీ ఆధారంగా ఐటి అధికారులు గుర్తించారు. దీంతో దాదాపు పది బంగారు నగల వ్యాపారులకు నోటీసులు జారీ చేయనున్నట్టు ఆదాయపు పన్నుశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.