రాష్ట్రీయం

జన్మభూమి స్పందన తట్టుకోలేకే విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఎపి గనులు, స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ స్పందనను చూసి ఓర్వలేక ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి నేతలు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తోందని అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు విడతల జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులో 95 శాతం దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిన విషయాన్ని ప్రతిపక్షం తెలుసుకోవాలని అన్నారు. రెండు విడతల జన్మభూమిలో 34,87,546 దరఖాస్తులు అందగా వాటిలో 33,36,557 పరిష్కరించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 12.5 లక్షల రేషన్‌కార్డులను, 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు, ఎన్టీఆర్ జలసిరి కింద జిల్లాలో 50 వేల బోర్లు వేయనుందని తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో ఏమైనా సమస్యలు ఉంటే నిర్మాణాత్మకమైన సూచనలు ఆందించకుండా విద్వేషంతో వ్యవహరించడం సరికాదని అన్నారు. అసెంబ్లీలోనూ వైసిపి సభ్యుల అనుచిత వైఖరిని సరిదిద్దాల్సిన ప్రతిపక్ష నేత జగన్ స్పీకర్ నియమించిన విచారణ కమిటీపైనా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మహిళా సమాజం తలదించుకునే విధంగా ఎమ్మెల్యే రోజా వ్యవహరిస్తే కనీసం మందలించని జగన్ కమిటీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు.
త్వరలో ఆర్టీసి ఎన్నికలు
7న యూనియన్లతో కార్మికశాఖ భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 3: ఏపిఎస్ ఆర్టీసిలో గుర్తింపు సంఘం ఎన్నికల నగారా మోగనుంది. బహుశా ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల విషయమై ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో కార్మికశాఖ కమిషనర్ కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు. సంక్రాంతి పండగ తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణకు తేదీలు ఖరారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి ఆస్తుల విభజన కాకపోయినా, టిఎస్‌ఆర్‌టిసి, ఏపిఎస్‌ఆర్‌టిసికి వేరువేరుగా ఎన్నికలు జరగనున్నాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికలను బట్టి తెలంగాణ ఆర్టీసిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం ఆంధ్రాలో గుర్తింపు సంఘంగా ఎంప్లారుూస్ యూనియన్ ఉంది. కాగా ఎన్నికల బరిలో నేషనల్ మజ్దూర్ యూనియన్, స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఐఎన్‌టియుసి, భారతీయ మజ్దూర్ సంఘ్, కార్మి పరిషత్, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ తలపడనున్నాయి.
నేడు డిపోలవద్ద ధర్నా
ఎంప్లారుూస్ యూనియన్ ఉపప్రధాన కార్యదర్శి వి. దామోదర్ మాట్లాడుతూ అద్దె బస్సుల టెండర్లను రద్దు చేయాలని, అద్దె బస్సుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 4వ తేదీన అన్ని డిపోల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు.
గుర్తింపు సంఘం ఎన్నికలకు తమ సంఘం సిద్ధంగా ఉందని, ఈ సారి కూడా తమ సంఘాన్ని విజయం వరిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇప్పించామన్నారు.