రాష్ట్రీయం

విభజన ఫలాలు అందరికీ అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్ వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందించడానికి కార్యాచరణను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు విధుల్లో చేరి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో ‘నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్’ అన్న అంశంపై మార్గదర్శనం చేసేందుకు డిసెంబర్ 14న కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయం (ప్రగతి భవన్)లో ఆదివారం మంత్రి కె తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఇతర సలహాదారులు బి పాపారావు, ఎకె గోయల్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, శాంతకుమారి, స్మితా సభర్వాల్, ప్రియాంక నర్గీస్, సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, సోమేష్‌కుమార్ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించారు. తాము పనిచేస్తున్న జిల్లా గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడంతో పాటు ఆ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి? రహదారుల పరిస్థితి? రైల్వే మార్గాల వ్యవస్థ, నీటిపారుదల ప్రాజెక్టుల స్థితి? ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మిషన్ భగీరథ, బ్యాంకింగ్ వ్యవస్థ, నగదు రహిత లావాదేవీలు, వ్యవసాయ రంగం పరిస్థితి తదితర అంశాలపై సమగ్రమైన నివేదికలు సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే జిల్లాల్లో పారిశ్రామిక రంగం పురోగతి, కొత్త పరిశ్రమల స్థాపన, వైద్య, ఆరోగ్య వ్యవస్థలో ప్రస్తుత స్థితి, లోపాలు, విద్యారంగం పరిస్థితి, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల వినియోగం, అటవీ భూముల పరిస్థితి, ప్రభుత్వ భూముల వినియోగం, విద్యుత్ సబ్ స్టేషన్లు, వౌలిక వసతులు, మానవ వనరుల వినియోగం, సాదా బైనామాల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై కలెక్టర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక వనరులు, బలాలు, బలహీనతలను భేరీజు వేసుకుని జిల్లాల అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలన్నారు. జనాభా వారీగా 31 జిల్లాలను నాలుగు భాగాలుగా విభజించి వేర్వేరుగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. వ్యవసాయ రంగం విస్తరించాల్సిన అవసరం ఉందని, పండ్లు, కూరగాయాల తోటలను ప్రోత్సహించాలని, దీని కోసం కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం అత్యంత క్రియాశీలకంగా మారాలని, జిల్లా పరిపాలనా విభాగాలు సమర్థవంతంగా పని చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. చిత్తశుద్ధితో పని చేసే మంచి ఫలితాలు వస్తాయని, సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని మెరుగు పర్చుకోవడమే ఇందుకు నిదర్శనం అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. జిల్లా యూనిట్‌గా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంస్థలు, నిధులకు సంబంధించి కూడా ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం..ఆదివారం ప్రగతి భవన్‌లో అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కెసిఆర్