రాష్ట్రీయం

ఉపాధి పేరుతో వ్యభిచారం రొంపిలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 3: ఆర్ధిక ఇబ్బందులతో కడు పేదరికంలో మగ్గుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరు బ్రోకర్లు ఎదురు పెట్టుబడులు పెట్టి ఉపాధి పేరుతో గల్ఫ్ దేశాలకు తరలించి వ్యభిచార వృత్తికి అమ్ముకుంటున్న ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరు మధ్యవర్తుల బారిన పడి బెహ్రయిన్‌లో అడుగుపెట్టి అష్టకష్టాలు పడి తిండి తిప్పలు లేక శారీరక హింసకోర్చి.. చావు మేలనుకున్న స్థితిలో చిక్కి శల్యమైన ఓ అభాగ్యురాలు ఓ విదేశీ సామాజిక కార్యకర్త సహకారంతో ఎట్టకేలకు మన దేశానికి చేరుకుంది. అక్కడ షేక్‌ల అమానుష లైంగిక దాడులకు తట్టుకోలేని ఇలాంటి బాధితులు మరెందరో అక్కడ జీవనపోరాటంలో చావు బతుకులు మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ, యోగక్షేమాలు తెలియక ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా.. మధ్యవర్తుల నుంచి కోర్టుల్లో ప్రైవేటు కేసులు ఎదుర్కొంటున్నారు. తమ గోడు వెలిబుచ్చుకుని న్యాయం అడిగేందుకు సదరు బాధితురాలు భర్తతో కలిసి ఆదివారం విజయవాడ వచ్చింది. నగరంలోని డిజిపి క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు రాగా.. డిజిపి అందుబాటులో లేనందున వెనుదిరిగారు. ఈసందర్భంగా బాధితురాలు, ఆమె భర్త తమకు జరిగిన అన్యాయం గూర్చి మీడియా ఎదుట వాపోయారు. మధ్యవర్తుల దుర్మార్గాన్ని ఎండగట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం, ఈలకొలను గ్రామానికి చెందిన సూరిబాబు, భార్య భువనేశ్వరి (బాధితుల అసలు పేర్లు కావు). వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వికలాంగుడైన సూరిబాబు అనాధ అయిన భువనేశ్వరిని వివాహమాడాడు. కాస్త అందంగా ఉండే భువనేశ్వరిపై కొందరు బ్రోకర్ల కన్నుపడింది. పెద్దాడకు చెందిన పల్లపాటి రామకృష్ణ, జి మామిడాడకు చెందిన సిహెచ్ రత్న అనే ఇద్దరు మధ్యవర్తులు గల్ఫ్ దేశంలో ఉపాధి కల్పిస్తామని నమ్మబలికారు. పాస్‌పోర్టు, వీసా కోసం 50వేల వరకు వారే ఖర్చు పెట్టి, తొలి మూడు నెలల జీతం తమకు కమిషన్ ఇవ్వాలని ఒప్పందంతో ఖర్చులకు కొంత డబ్బు కూడా చేతికిచ్చి 2014లో భువనేశ్వరిని బెహ్రయిన్ పంపారు. ఇక అంతే అక్కడి నుంచి ఆమె వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో ఇక్కడివారు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.