రాష్ట్రీయం

బంగారం ఇస్తామని మోసగించి సొమ్ముతో పరారైన సిఐ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: సినీ ఫక్కీలో ఓ పోలీస్ అధికారి, కాంగ్రెస్ నేతతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కలసి భారీ మోసానికి పాల్పడిన కేసులో పోలీసులు 24 గంటల్లోనే పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడైన సిఐ రాజశేఖర్‌ను పోలీసులు ఆదివారం విజయవాడలో అరెస్టు చేశారు. కేవలం రూ.18 వేలకే తులం బంగారం ఇస్తామని నమ్మబలుకుతూ ఆయన బంజారాహిల్స్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌ను కేంద్రంగా చేసుకుని అక్రమ దందా కొనసాగించారు. ఈ అక్రమ దందాలో స్థానిక కాంగ్రెస్ నేత తిరుమలేష్ నాయుడు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని, పాత కరెన్సీని కూడా తీసుకుంటామని వీరంతా వ్యాపారులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. బంగారం ఇస్తామని చెప్పి అగర్వాల్ అనే వ్యాపారితో రూ.30 లక్షలకు, రేవంత్ అనే వ్యక్తితో రూ. 50 లక్షలకు, మరో ఇద్దరు వ్యక్తులతో రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్న తిరుమలేష్ నాయుడు అదే సమయంలో సిఐ రాజశేఖర్‌తో కలసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ ప్రకారం శనివారం వ్యాపారులు రాగానే ఇద్దరు కానిస్టేబుళ్లతో కలసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన రాజశేఖర్ ఆ వ్యాపారుల నుంచి మొత్తం రూ.1.10 కోట్ల సొమ్ము తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో తాము మోసపోయినట్టు గ్రహించిన అగర్వాల్, రేవంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తిరుమలేష్ నాయుడును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను విచారిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న సిఐ రాజశేఖర్‌ను ఆదివారం పోలీసులు విజయవాడలో అరెస్టయిన రాజశేఖర్ సిఎం క్యాంప్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అతడిని హైదరాబాద్ తీసుకువచ్చి విచారణ జరుపుతామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.