రాష్ట్రీయం

పొట్టగొట్టేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: ‘ఉద్యోగులకు కడుపు నిండా పెట్టాలి. ఆడుతూ పాడుతూ సంతోషంగా పని చేయించుకోవాలి’ అనేది తమ ప్రభుత్వ లక్ష్యమని సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రాష్ట్భ్రావృద్ధికి చిత్తశుద్ధితో సిఎం నుంచి అటెండర్ వరకు పని చేయాల్సిందేనన్నారు. ‘సినిమాలో హీరో ఒక్కడే ఉండడు. చాలా పాత్రలు ఉంటాయి. ఎవరి పాత్ర వారు చక్కగా పోషించినప్పుడే సినిమా హిట్టు. అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కిందిస్థాయి ఉద్యోగి నుంచి సిఎం వరకూ ఎవరి పాత్ర వారు పోషించాల్సిందే’నని సిఎం వ్యాఖ్యానించారు. విద్యుత్ శాఖలో సమ్మెకు పిలుపునిచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని సిఎం హామీ ఇవ్వడంతో నోటీసును ఉప సంహరించుకున్న విషయం తెలిసిందే. సమ్మె ఉపసంహరించుకున్న విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు సోమవారం సిఎం కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సింగరేణి, విద్యుత్ ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్భ్రావృద్ధిలో విద్యుత్ పాత్ర ఎంత ముఖ్యమైందో అందులో పనిచేసే ఉద్యోగుల పాత్రా అంతే ముఖ్యమన్నారు. 24 గంటలూ అలుపెరగని సేవలందించే విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘ప్రభుత్వంతో ఉద్యోగులు అప్పుడప్పుడు పలు డిమాండ్ల కోసం కొడ్లాడతారు. అయితే తెగేదాకా లాగడం మంచి పద్ధతి కాదు’ అన్నారు. ‘పని బందుజేసి కూసుంటామంటె ఎట్ల? ఇప్పుడే తెలంగాణ అందరితో మంచి పేరు తెచ్చుకుంటుంది. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని మరింత పెంచుకోవాలె తప్ప బందులు చేసి పాడు చేసుకుంటామా? ఒక్కసారి కాకపోతే పదిసార్లు మాట్లాడుకోవాలి. సమస్యలు పరిష్కరించుకోవాలె’ అని సిఎం హితవు పలికారు. ‘రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి. అధికారం శాశ్వతం కాదు. తెలంగాణ శాశ్వతం. ప్రజలు శాశ్వతం. ప్రజలకు సేవలందించడం ఉద్యోగి ధర్మం. కింది నుంచి పై అధికారి వరకూ ఈ విషయాన్ని గుర్తెరిగి సమన్వయంతో పని చేసిన రోజున తెలంగాణ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు’ అని సిఎం హితవుపలికారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్‌శాఖను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆగమాగం చేయడంతో పారిశ్రామికవేత్తలు కరంట్ కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కరంట్ కావాలని అడిగిన రైతులను పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర నుంచి తెలంగాణ తనకు తానుగా తీర్చిదిద్దుకుని నిలదొక్కుకుంటుందని సిఎం గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం కరంట్ ఉంటే వార్త కాదు, కరంట్ పోతే వార్త’ అని చమత్కరించారు. గత పాలకులు ఉద్యోగుల సమస్యలను తేలికగా చూసి గోటితో పొయేదాన్ని గొడ్డలిదాకా తీసుకొచ్చి జఠిలం చేసేవారని, ఉద్యోగులతో కోరి కొట్లాట తెచ్చుకునే సాంప్రదాయానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించడానికి ఉద్యోగ సంఘాలు చొరవ చూపాలని సిఎం సూచించారు. పకడ్బందీగా క్రమబద్ధీకరణ జరుగకపోతే ఏవో వంకలు పెట్టి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తారు. అలాకాకుండా పకడ్బందీగా విధివిధానాలు రూపొందించడానికి ఉద్యోగ సంఘాలు సహకరించాలని పిలుపునిచ్చారు. విధి విధానాలను మార్చి నెలాఖరుకల్లా ముగించాలని అధికారులను ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో గతంలో సస్పెండ్ చేసిన ఉద్యోగులను మానవతా దృక్పథంతో తిరిగి ఉద్యోగాలలోకి తీసుకోవాలని ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులను సిఎం ఆదేశించారు. ఉద్యోగులకు భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనున్నట్టు సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు.

చిత్రం..సిఎం కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు చెబుతున్న విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు