రాష్ట్రీయం

బ్లాక్ డే ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ పాతబస్తీలో పలు చోట్ల ముస్లింలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మంగళవారం బ్లాక్ డేను పురస్కరించుకుని పత్తర్ గట్టి, బార్కస్, గోల్కొండ, మదీనా, షంషీర్ గంజ్ ప్రాంతాల్లో పలువురు దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సరిహద్దులో ప్రత్యేక బలగాలను మోహరింపజేశారు. బ్లాక్ డే సందర్భగా పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డేగ కన్నుతో కంట్రోల్ కమాండ్ రూం ద్వారా పర్యవేక్షించారు. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లపై గట్టి నిఘా పెట్టారు. హైదరాబాద్‌లో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయగా, కొన్ని చోట్ల మధ్యాహ్నం వరకు షాపులు బంద్ చేశారు. మొత్తం మీద బ్లాక్ డే ప్రశాంతంగా ముగిసినట్టు నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.