రాష్ట్రీయం

ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ ప్రాంతంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో సమైక్య రాష్ట్ర ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడ్డదని, ఈ అంశంపై విచారణ జరిపించాలని సుపరిపాలన వేదిక (్ఫరం ఫర్ గుడ్ గవర్నెన్స్) డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని (లక్డీకాపూల్) సుపరిపాలనావేదిక కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వేదిక అధ్యక్షుడు జస్టిస్ రెడ్డపరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి మాట్లాడారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల పేరుతో ఖజానానుండి విడుదల చేసిన 14,483 కోట్ల రూపాయలు వృథా అయ్యాయన్నారు. గోదావరి నదీజలాలను సేద్యంతో పాటు ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు గత ప్రభుత్వం బృహత్ ప్రణాళిక రూపొందించిందని గుర్తు చేశారు.
వ్యాప్‌కోస్ సంస్థకు సర్వే పనులను ప్రభుత్వం అప్పగించిందని, ఈ సంస్థ సమగ్ర సర్వే చేసి తుమ్మిడిహట్టి వద్ద గోదావరి నుండి 160 టిఎంసిల నీటిని వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 17,875 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ప్రతిపాదించిందన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం 2007 మే 17 న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకోసం అనుమతించిందని తెలిపారు. అయితే ప్రాజెక్టు వ్యయాన్ని 38,500 కోట్లకు పెంచారని వివరించారు. ఒక ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇఎన్‌సి), ఇద్దరు సిఇలతో నిపుణుల కమిటీ వేయగా, ఈ కమిటీ లోతుగా పరిశీలించి 38,500 కోట్లతో ప్రాజెక్టును చేపట్టవచ్చని సిఫార్సు చేశారన్నారు. చివరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)లో ఈ ఖర్చు 40,300 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారన్నారు.
ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై 12,233 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, 1937 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా విడుదల చేశారన్నారు. ప్రాజెక్టు నిలిచిపోవడంతో కొంత భాగం రికవరీ చేసినప్పటికీ, 524 కోట్ల రూపాయలు మొండిబకాయిగా మిగిలిందని స్పష్టం చేశారు. అలాగే ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులను నిర్మించేందుకు 5457 కోట్లతో ప్రాతిపాదనలు సిద్ధం చేయగా, ఇప్పటి వరకు 2250 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని గుర్తు చేశారు.