రాష్ట్రీయం

ఇక ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: నూతన విద్యా విధానం అమలులోకి తీసుకు వస్తున్న నేపథ్యంలో దేశంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మాదిరి ఇండియన్ ఎడ్యుకేషన్ సెంట్రల్ సర్వీసును ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన విధానాన్ని రూపొందించిన ప్రభుత్వం దానిపై నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయాలను సైతం స్వీకరించి, వాటిని క్రోడీకరించిన తర్వాత తదుపరి ప్రకటన చేయాలని చూస్తోంది. రానున్న రోజుల్లో దీనిని ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసు (ఐఇఎస్)గా వ్యవహరిస్తారు.
విద్యారంగంలో జాతీయ దృక్పథాన్ని పెంపొదించడంతో పాటు సారూప్యత, సమరూపత కల్పించేందుకు ఎంతో దోహదపడుతుందని చెబుతున్నారు. రిక్రూట్‌మెంట్ విధానం, ఐఇఎస్ అధికారుల విధులు, బాధ్యతలు, లక్ష్యాలను సైతం కేంద్రం రూపొందించింది. అయితే వీటిని ఖరారు చేసే ముందు రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్టు మానవ వనరుల మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా ప్రైవేటు స్కూల్ విద్యార్ధులకే ఆంగ్లంలో ప్రావీణ్యం బాగా ఉంటోందని, ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయని 33 రాష్ట్రాల్లోనూ ఇదే స్థితి ఉందని కేంద్ర హెచ్‌ఆర్‌డి సర్వేలో వెల్లడి అయింది. ఈ క్రమంలో విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
1976కు ముందు విద్య కేంద్ర జాబితాలోనే కొనసాగింది. 1976 తర్వాత విద్యారంగంలో పెనుమార్పులకు వీలుగా రాష్ట్రాలకు అప్పగించి, కేంద్రం నిధులను ఇచ్చి సహకరించేది, 1986 నూతన విద్యావిధానం (సవరించిన విధానం 1992లో వచ్చింది) ద్వారా విద్యను తిరిగి ఉమ్మడి జాబితాలోకి తీసుకువచ్చారు. కమిటీ నివేదికలో 33 అంశాలపై సమగ్రంగా చర్చించారు.