రాష్ట్రీయం

‘అన్నయ్యా’ అని పిలిచేవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: ‘అన్నయ్యా’ అని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనను అప్యాయంగా పిలిస్తే కడుపు, మనసు సంతోషంతో నిండిపోయేవని దర్శకరత్న దాసరి నారాయణ రావు గద్గద స్వరంతో అన్నారు. అలనాటి ప్రముఖ సినీ నటి, తమిళనాట రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేకతను నిలుపుకున్న జయలలిత అస్తమించడం పట్ల సినీ నటులు, దర్శకులు దిగ్భ్రాంతి చెందారు. తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణ రావు ఈ సందర్భంగా జయలలితతో తన కుటుంబానికి ఉన్న అప్యాయత గురించి నెమరువేసుకున్నారు. లోగడ తాను, తన శ్రీమతి కలిసి జయలలితను కలిసినప్పుడు ఎంతో బాగా పలకరించి, ఆప్యాయంగా అన్నయ్యా అని పిలిచారని ఆయన తెలిపారు. అంతేకాకుండా పలుసార్లు ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా తనను అన్నయ్యా అని పిలిచారని చెప్పారు. ఆమె ఇల్లు ‘పోయెస్ గార్డెన్’లో షూటింగ్ చేసే భాగ్యం తనకు కలిగిందని అన్నారు. ప్రముఖ సినీ నటి జమున కూడా జయలలితతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నా, తనతో సన్నిహితంగా మాట్లాడేవారని చెప్పారు. జయలలిత అమ్మలాంటి వారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జయలలిత అనేక తెలుగు సినిమాల్లో నటించారు. అందులో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్‌తో 10 సినిమాల్లో, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావుతో ఏడు సినిమాల్లో నటించారు. ఇంకా నటశేఖర కృష్ణ, శోభన్ బాబు వంటి ప్రముఖ నటులతో కూడా ఆమె నటించారు.