రాష్ట్రీయం

ప్రముఖుల సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇఎల్‌ఎన్ నరసింహన్, జయలలిత మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. జయలలిత మృతికి సంతాప సూచకంగా తెలంగాణ సచివాలయంపై అధికారులు జాతీయ జెండాను అవనతం చేశారు. అనంతరం రెండు నిముషాలపాటు వౌనం పాటించారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ జయ మృతికి సంతాపం తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల హృదయాలను గెలిచిన గొప్ప నేత జయలలిత అని కొనియాడారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా, సినీ రంగానికి సుపరిచితులై, ప్రజాసేవకు అంకితమైన జయలలిత మృతికి ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంతాపం తెలిపింది. చలనచిత్ర రంగం అభివృద్ధి సంస్థ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ జయ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వైఎస్‌ఆర్ సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ జయలలిత మృతికి సంతాపం ప్రకటించారు. చలనచిత్ర రంగంతోపాటు రాజకీయ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి జయలలితని ఆయ శ్లాఘించారు. తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర పార్టీ సంతాపం తెలిపింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ సినీరంగంలో జీవితాన్ని ప్రారింభించిన జయలలిత చిన్న వయసులోనే ఎంపి, ముఖ్యమంత్రి అయ్యారని, ఎన్టీఆర్ లాగానే తమిళనాడులో సంక్షేమ రంగానికి ప్రాధాన్యతనిచ్చారని ఆయన కొనియాడారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి తదితరులు జయలలిత మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జయలలిత మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని, సినీరంగం నుండి రాజకీయ ప్రవేశం చేసిన జయలలిత మంచి నాయకురాలిగా ఎదిగారని కొనియాడారు. జయలలిత మృతి పట్ల సిపిఎం తెలంగాణ రాష్ట్ర శాఖ సంతాపం ప్రకటించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి నాగయ్య జయకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మహిళా ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు కొనసాగారని, తక్షణ ఉపశమన పథకాల ద్వారా పేదలకు దగ్గరై లక్షలాది మందిలో ‘అమ్మ’గా ముద్ర వేసుకున్నారన్నారు.