రాష్ట్రీయం

సవ్యశాట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ సూళ్లూరుపేట, డిసెంబర్ 7: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆకాశమే హద్దుగా విజయపరంపర కొనసాగిస్తోంది. రోదసి పరిశోధనలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. షార్ నుండి స్వర్ణకాంతులు వెదజల్లుతూ నింగిలోకి ఎగసిన పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ఇస్రోకు సరికొత్త రికార్డు తెచ్చిపెట్టింది. 1,235 కిలోల బరువు కలిగిన రీసోర్స్ శాట్-2ఎ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చి తమ మేధస్సుకు ఇదే నిదర్శమని ఇస్రో శాస్తవ్రేత్తలు ప్రపంచానికి చాటారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇస్రో బుధవారం చేపట్టిన పిఎస్‌ఎల్‌వి-సి 36 విజయంతో అరుదైన రికార్డు సొంత చేసుకుంది. ఏడాదిలో విభిన్నంగా తొమ్మిది ప్రయోగాలు కొనసాగించి తనకు తానే సాటిగా నిలిచింది. ఇస్రో నమ్మినబంటు ‘పిఎస్‌ఎల్‌వి’ రాకెట్ల ద్వారా ఏడాది ఆరు ప్రయోగాలు చేపట్టి రికార్డుల మోత మోగించింది. 1994లో ప్రారంభమైన పిఎస్‌ఎల్‌వి తరహా ప్రయోగాలు ఈ ఏడాది అత్యధికంగా ఇస్రో చేపట్టడం గమనార్హం. అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం మరోమారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కదనాశ్వం పిఎస్‌ఎల్‌వి-సి 36 మరోసారి విజయబావుటా ఎగరవేసింది. బుధవారం ఉదయం 10:25 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో 38వ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ థావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (షార్)లోని సోమవారం రాత్రి 10:25కు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 36 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. తరువాత బుధవారం ఉదయం 10:25కు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నింగికెగసిన అనంతరం ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రోలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ఈ వాహక నౌక ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రీసోర్స్ శాట్-2ఎ ఉపగ్రహాన్ని మొదట 17:55 నిమిషాలకు భూమికి 827 కిలోమీటర్ల మీ ఎత్తులో సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి 98.719 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టారు. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సూపర్ కంప్యూటర్ల ద్వారా శాస్తవ్రేత్తలతో కలసి రాకెట్ గమనాన్ని చూస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎఎస్ కిరణ్‌కుమార్ రాకెట్ నాలుగు దశలు పూర్తయి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేరినంతరం పిఎస్‌ఎల్‌వి-సి 36 విజయాన్ని అధికారికంగా ప్రకటించి శాస్తవ్రేత్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. రీసోర్స్ శాట్-2ఎ ఉపగ్రహం రైతులకు ఎంతో మేలు చేయనుంది. ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏమేరకు దిగుబడి వస్తోంది, వ్యవసాయానికి అనులకూల ప్రాంతాలు ఎక్కడున్నాయి.. లాంటి వివరాలు తెలియజేయడమే కాకుండా పట్టణ ప్రణాళిక, వ్యవసాయ, రక్షణ రంగాలకు ఎంతో ప్రయోజనం చేరుకూరుతోంది. రీసోర్స్ శాట్-1, 2 కాలపరిమితి ముగించడంతో దానిస్థానంలో రీసోర్స్ శాట్-2ఎ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఇది ఐదేళ్లుపాటు సేవలు అందించనున్నట్టు శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న పిఎస్‌ఎల్‌వి -సి 36.
chitram...
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి
బుధవారం ఉదయం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి
దూసుకెళ్తున్న పిఎస్‌ఎల్‌వి -సి 36.