రాష్ట్రీయం

మార్చి 2నుంచి ఇంటర్ 21నుండి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్షలు మార్చి 21నుంచి ఏప్రిల్ 7 వరకూ, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2 నుంచి మార్చి 21 వరకూ జరగనున్నాయి. టెన్త్ పరీక్షలకు రెగ్యులర్ అభ్యర్ధులు 6.2 లక్షల మంది, ప్రైవేటు అభ్యర్థులు 41వేల మందితో కలిపి 6.61 లక్షల మంది హాజరుకానున్నారు. ఎస్సెస్సీ ఒకేషనల్ పరీక్షలకు మరో 25వేల మంది హాజరవుతున్నారు. వీరందరికీ ఇప్పటికే హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. పరీక్షలకు 3100 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి పరీక్ష కేంద్రాల్లో బెంచిలు, లైట్లు, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయం, ఇతర వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 2న మొదలై మార్చి 21వరకూ జరుగుతాయి. ఎథిక్స్-హ్యుమన్ వాల్యూ పరీక్ష జనవరి 27న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకూ జరుగుతుంది. ఎఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 24 వరకూ జరుగుతాయి. ఫస్టియర్ పరీక్షలు మార్చి 2 నుంచి మార్చి 19వరకూ సెకండియర్ పరీక్షలు మార్చి 3నుంచి మార్చి 21 వరకూ జరుగుతాయి. ఫస్టియర్ పరీక్షలకు 5,24,483 మంది, సెకండియర్‌కు 6,13,793 మంది మొత్తం 11,40,276 మంది హాజరవుతున్నారు. ఫస్టియర్ , సెకండియర్ కలిపి బాలురు 5,92,975మంది, బాలికలు 5,47,301 మంది రాస్తున్నారు. థియరీ పరీక్షలకు 1550, ప్రాక్టికల్ పరీక్షలకు 1724 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం అమలు చేయనున్నారు. 2009లోనే ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం అమలు చేయాలని భావించినా, గత ఆరేళ్లుగా అది కాగితాలకే పరిమితమైంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేసి తీరుతామని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వొకేషనల్ పరీక్షల కొన్ని పేపర్లను ఆన్‌లైన్‌లో వాల్యూయేషన్ చేస్తామని, వచ్చే ఏడాది నుంచి అన్ని పేపర్లను ఆన్‌లైన్‌లోనే వాల్యూయేషన్ చేసే ప్రతిపాదన ఉందని మంత్రి చెప్పారు.