రాష్ట్రీయం

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా గురువారం విడుదల చేశారు. మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 17 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ వివరాలను గురువారం ఇక్కడ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మార్చి 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, 2 నుంచి రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 1న సెకండ్ లాంగ్వేజ్, 3న ఇంగ్లీషు, 6న మ్యాథ్స్1ఎ, బాటనీ, సివిక్స్, సైకాలజీ, 8న మ్యాథ్స్ 1బి, జువాలజీ, హిస్టరీ, 10న ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్, 13న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్సు, మ్యూజిక్, 15న జియాలజీ, హోం సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్, 17న మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ రెండో సంవత్సరానికి సంబంధించి 2న ద్వితీయ భాష, 4న ఇంగ్లీషు, 7న మ్యాథ్స్ 2ఎ, బాటనీ, సివిక్స్, సైకాలజీ, 9న మ్యాథ్స్2బి, జువాలజీ, హిస్టరీ, 11న ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్, 14న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్సు మ్యూజిక్, 16న జియాలజీ, హోం సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్టు మ్యాథ్స్, 18న మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తారు.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ పరీక్షను జనవరి 28న నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జనవరి 31న నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 3 నుంచి 22 వరకూ నిర్వహిస్తారని తెలిపారు. ప్రాక్టికల్స్‌ను కూడా జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
టెన్త్ పరీక్షలను మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకూ నిర్వహించనున్నారు. 17న మొదటి భాష-1, 18న మొదటి భాష-2, 20న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీషు పేపరు-1, 22న ఇంగ్లీషు పేపరు-2, 23న మ్యాథ్స్-1, 24న మ్యాథ్స్-2, 25న జనరల్ సైన్సు-1, 27న జనరల్ సైన్సు-2, 28న సోషల్ స్టడీస్-1, 30న సోషల్ స్టడీస్-2, 31న ఒఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్-2, ఏప్రిల్ 1న ఎస్‌ఎస్‌సి వొకేషనల్ పరీక్ష నిర్వహిస్తారు. సమస్యాత్మక సెంటర్ల వద్ద సిసి టీవీలను ఎర్పాటు చేస్తున్నామన్నారు.