రాష్ట్రీయం

ఆనందవనంలో సద్గురు శివానందమూర్తి జయంత్యుత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, డిసెంబర్ 8 : భక్తుల పాలిట భగవత్ స్వరూపంగా భాసిల్లిన సద్గురు శివానందమూర్తి 89వ జయంతి వేడుకలు భీమిలిలోని ఆనందవనంలో గురువారం ఘనంగా జరిగాయి. మార్గశిర శుద్ధ నవమినాడు జరుపుకునే గురూజీ జయంతి వేడుకలు ఆయన కుమారుడు బసవరాజు-రాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా ఆనందవనంలో గల ఉపన్యాస మందిరంలో గురూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వేదికపై గురూజీ పాదుకలను ఉంచి అర్చకులు గరిమెళ్ల రామావధాని ప్రత్యక్ష పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న బసవరాజు, రాజ్యలక్ష్మి దంపతులు, ఆశ్రమ నిర్వాహకులు రాఘవేంద్రరావు, సత్యవతి దంపతులు గురూజీ పాదుకలకు పంచామృతాభిషేం, క్షీరాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేకాలతో పాటు గురూజీ సహస్ర నామార్చన పూజలు నిర్వహించారు.
సుమారు 3 గంటల పాటు నిర్వహించిన పూజలను తిలకించిన భక్తులు ఆద్యంతం భక్తిపారవశ్యంతో శివానంద నామస్మరణతో పులకించిపోయారు. ఈ సందర్భంగా స్థానిక యోగా విద్యార్థులు నిర్వహించిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం ఆశ్రమ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో గురూజీ కుమార్తెలు అంబిక, గాయత్రి, ఆశ్రమ నిర్వాహకులు రాధాదేవి, శివానంద సుపథ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శివ, సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు సభ్యులు శివ తదితరులు పాల్గొన్నారు.
20న వరంగల్, 21న హైదరాబాద్‌లో గురూజీ జయంతి వేడుకలు
సద్గురు శివానంద మూర్తి జన్మదినం డిసెంబర్ 21ని పురస్కరించుకుని గురూజీ జయంతి వేడుకలు ఈనెల 20న వరంగల్‌లో, 21న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు గురూజీ కుమారులు బసవరాజు తెలిపారు. గురువారం స్థానిక ఆనందవనంలో ఆంధ్రభూమి విలేఖరితో మాట్లాడుతూ ఈనెల 21న హైదరాబాద్‌లో జరగనున్న గురూజీ జయంతి వేడుకల సందరభంగా రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సి. రంగరాజన్, మెట్రో రైలు రూపశిల్పి శ్రీ్ధరన్‌లకు ఎమినెంట్ సిటిజన్ అవార్డుల బహూకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గురూజీ జయంతి వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి గురూజీ శిష్యులు, భక్తులు రానున్నారని ఆయన తెలిపారు.

చిత్రం..ఆనందవనంలో గురూజీ పాదుకలకు పూజలు నిర్వహించిన దృశ్యం