రాష్ట్రీయం

ఓటుకు నోటు కేసులో బాబుకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9:ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊరట లభించింది. ఈ కేసులో విచారణ జరిపించాలని ఏసిబి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఏసిబి కోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో విచారణ జరిపించాలని ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయడంలో ఏసిబి విఫలమైందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఏసిబి కోర్టు విచారణ జరపాలని ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై జస్టిస్ సునీల్ చౌదరి తీర్పును ఇస్తూ, ఈ కేసులో ఫోన్ సంభాషణల్లో ఉన్న గొంతు చంద్రబాబుదేనంటూ ప్రభుత్వంతో సంబంధంలేకుండా వేరే సంస్ధ ఇచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరడం తగదన్నారు. పైగా ఈ కేసులో ఏసిబి కోర్టుకు ఫిర్యాదుచేసిన వ్యక్తి విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్నారు. ఏ ప్రాతిపదికపైన ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేయవచ్చన్న అభియోగాలను కొట్టివేయలేమన్నారు. కేసులో దర్యాప్తుపెండింగ్‌లో ఉండగా, రెండవ సారి ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయడమనేది అసంబద్ధమని చంద్రబాబు తరఫున వాదించిన న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా అభిప్రాయంతో ఏకీభవించినట్లు కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఎమ్మెల్యే పిటిషన్‌ను అనుమతిస్తే, ఇంకా అనేక కేసుల్లో దర్యాప్తుపై పిల్స్ దాఖలవుతాయన్న వాదనలతో పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయస్ధానం పేర్కొంది. కాగా హైకోర్టు తీర్పు అనంతరం వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు వెలుపల మాట్లాడుతూ సుప్రీంకోర్టులో అపీల్‌కు వెళ్లనున్నట్టు దాఖలు చెప్పారు.