రాష్ట్రీయం

ఖాతాదారుల కాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల కష్టాన్ని నిన్నటి వరకూ వౌనంగా భరించిన జనంలో క్రమంగా కాక పెరుగుతోంది. రోజుల తరబడిన కష్టాలు, క్యూలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదన్న
ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఏ బ్యాంకు కెళ్ళినా సర్వర్ డౌన్ అనో, కొత్త కరెన్సీ కరవనో బోర్డులు దర్శనమిస్తుంటే, జనంలో అసహనం కనిపిస్తోంది. శని, అది, సోమవారాలు బ్యాంకులకు సెలవుకావడంతో శుక్రవారం ఉదయమే టోలిచౌకి, లంగర్‌హౌస్ ఎస్‌బిఐ బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. రొటీన్ కష్టమే ఎదురవడంతో.. ఇలా ఎంతకాలం అంటూ ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్‌పై బైఠాయంచి ధర్నాకు దిగారు. ఆర్టీసి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి బుజ్జగించినా ససేమిరా అంటూ ఆందోళన కొనసాగించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.