రాష్ట్రీయం

‘సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ తెరిపించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్‌లోని సహకార చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో సామాజిక న్యాయం - సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తాను నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర 54 రోజులకు చేరిందని తెలిపారు. తాను నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించగానే సారంగాపూర్ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులు ఫ్యాక్టరీకిని తెరిపించాలని కోరుతూ వినతి పత్రాలు పట్టుకుని ఎదురు వచ్చారని ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో, అనంతరమూ టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సారంగాపూర్ ఫ్యాక్టరీని నడిపిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. గత ఆరున్నర దశాబ్దాలుగా పని చేస్తున్న పెద్ద సహకార పరిశ్రమ ఇది అని ఆయన తెలిపారు. ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించే బదులు ప్రైవేటు యాజమాన్యాలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయడం అంటే రైతుల ఆత్మగౌరవాన్ని ప్రైవేటు కంపెనీలకు తాకట్టు పెట్టడమే అవుతుందని తెలిపారు.