ఆంధ్రప్రదేశ్‌

తుపాను దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/మచిలీపట్నం, డిసెంబర్ 10: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వార్ధా’ తుపాను శనివారం సాయంత్రానికి పెను తుపానుగా మారింది. ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 650 కిమీ, చెన్నైకి 660 కిమీ దూరంలో ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. తుపాను కదలికల్లో వేగం పెరిగింది. శనివారం రాత్రి వరకూ ఉన్న సమాచారం మేరకు తుపాను 18 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తోంది. 12వ తేదీ సాయంత్రం మచిలీపట్నం, నెల్లూరు మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో కోస్తా అంతటా రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈశాన్య దిశగా గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో గాలుల వేగం 60 కిమీ దాటే అవకాశం ఉందని తెలిపారు. కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద సూచికను, మిగిలిన అన్ని ప్రధాన పోర్టుల్లో 2వ నెంబర్ సూచిని ఎగుర వేశారు. కృష్ణా జిల్లాలో తీర ప్రాంత మండలాలైన బందరు, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.