రాష్ట్రీయం

కాకినాడ పోర్టు భూముల కబ్జా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 3: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని పోర్టుకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన భూములు ట్యాంపరింగ్ అయినట్టు తెలుస్తోంది. పోర్టుకు సంబంధించి 17 సర్వే నెంబర్ల పరిధిలో విలువైన భూములను కొందరు కబ్జాదారులు ట్యాంపరింగ్ చేసి, ఆక్రమించుకున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ అక్రమాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆయా రికార్డ్‌లను పరిశీలిస్తున్న అధికారులు ట్యాంపరింగ్ జరిగినట్టు రుజువైతే అందుకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని నిర్ణయించారు. పోర్టు భూములు అన్యాక్రాంతమైనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణను విచారణాధికారిగా నియమించారు. ట్యాంపరింగ్ జరిగినట్టు అందిన ఆయా సర్వే నెంబర్ల భూముల రికార్డ్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ వ్యవహారంపై విచారణ నత్తనడకన సాగుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ భూదందాపై రాష్ట్ర ముఖ్యమంత్రికి సుమారు 3నెలల క్రిందటే ఫిర్యాదు అందినట్టు సమాచారం. ఆయన వెనువెంటనే విచారణకు ఆదేశించినప్పటికీ, నివేదికను సిద్ధం చేయడంలో నెలకొన్న జాప్యంపై ఆయా వర్గాలలో అసంతృప్తి నెలకొన్నది. పోర్టుతో పాటు రైల్వే, నగర పాలక సంస్థలకు చెందిన భూములు కూడా అన్యాక్రాంతం అయినట్టు ముఖ్యమంత్రికి ఫిర్యాదులందాయి. కాకినాడ నగరంలో రైల్వే, పోర్టు, నగరపాలక సంస్థలకు చెందిన సుమారు 200 ఎకరాలు భూములు అన్యాక్రాంతం అయినట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయల విలువైన ఈ భూముల రికార్డులను తారుమారు చేసినట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. కాగా పోర్ట్ భూములు ట్యాంపరింగ్ జరిగినట్టు రూఢీ కాగా, నగర పాలక సంస్థ ఆధీనంలో గల కోట్లాది రూపాయల విలువైన రైల్వే భూములు కూడా ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది. రైల్వేకు సంబంధించి ఆక్రమిత ప్రాంతాలను గుర్తించి, ఏ మేరకు కబ్జాకు గురయ్యాయనే విషయాన్ని నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందించే పనిలో కాకినాడ నగర పాలక సంస్థ అధికారులున్నారు.