రాష్ట్రీయం

సర్వసన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: వార్ధా తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ, పునరావాస చర్యలు ప్రపంచానికే ఆదర్శంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి, పంటనష్టాల్ని తగ్గించాలని, ఎంత వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపడితే అంత త్వరగా ఉపశమనం లభిస్తుందని అన్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఈదురుగాలుల వేగం, నమోదయ్యే వర్షపాతం వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపామన్నారు. వార్ధా తుపాను ప్రభావం, సహాయ, పునరావాస చర్యలపై ఇస్రో, వాతావరణ, విపత్తు నిర్వహణ, జలవనరులు, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, పౌరసరఫరాల శాఖ అధికారులతో విజయవాడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆదివారం సాయంత్రం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలు, హెవీకట్టర్లు, పొక్లెయిన్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పంటలను కాపాడటం, వాననీటిని ఒడిసిపట్టడం, జలవనరులను కాపాడటంపై కూడా అధికారులు దృష్టి సారించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. తుపానుకు సంబంధించిన పూర్తి సమాచారం సిఎం డ్యాష్‌బోర్డులో ఉంచాలన్నారు. ఈదురుగాలుల వేగం, నమోదయ్యే వర్షపాతం వివరాలను ఇప్పటికే మండలాల వారీగా అంచనా వేసి జిల్లా కలెక్టర్లకు పంపామన్నారు. ఈ వివరాల్లో కచ్చితత్వం ఎంత ఉందో తెలుసుకోవాలని, ఈ మేరకు వివరాలను డాక్యుమెంటేషన్ చేయాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ అంతరాయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని, ప్రతి జిల్లాల్లో కనీసం 1000 విద్యుత్ స్తంభాలు, 100 కిలోమీటర్ల కండక్టర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. సూళ్లూరుపేట, తడలో రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, నెల్లూరులో ఉన్న టీమ్‌ను సూళ్లూరుపేటకు పంపనున్నట్లు అధికారులు వివరించారు. చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ అంచనాలపై దృష్టి, ముందస్తు చర్యలు, వేగంగా స్పందించి సహాయ, పునరావాస చర్యలు చేపట్టడం ద్వారానే తుపాను నష్టాలను తగ్గించగలమన్నారు. రెయిన్‌గేజ్‌లు, పీజోమీటర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. తుపాను తీవ్రతను అంచనా వేయడంలో, కార్యాచరణలో టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నామని, దాని కచ్చితత్వాన్ని విశే్లషించడం ద్వారా భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించడం సులభం అవుతుందన్నారు. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాన్ని సమన్వయం చేసేందుకు వీలుగా నాలుగు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రకాశం జిల్లాకు ముఖేష్ కుమార్ మీనా, నెల్లూరు జిల్లాకు బి శ్రీ్ధర్, చిత్తూరు జిల్లాకు రవిచంద్ర, కడప జిల్లాకు రామ్‌గోపాల్‌ను నియమించారు. ఈ కాన్ఫరెన్సులో విపత్తు నిర్వహణ కమిషనర్ ఎంవి శేషగిరి బాబు, ఇన్‌చార్జి డిజిపి సాంబశివరావు, కమాండ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.