రాష్ట్రీయం

పోలీస్ కస్టడీకి మోసగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ఎక్స్‌లెంట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఆర్బిట్ సొల్యూషన్స్ సంస్థల పేరుతో మోసానికి పాల్పడి కోర్టుకు లొంగిపోయిన ఘరానా మోసగాడిని సిసిఎస్ పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే రెండు నెలల్లోనే 30 నుంచి 35 శాతం లాభాలు ఇస్తానంటూ రూ. 20 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు నిందితుడు విచారణలో అంగీకరించాడు. లాభాల పేరుతో భారీ మొత్తంలో అమాయక ప్రజలను మోసం చేసిన ఇతని నుంచి సిసిఎస్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇతని దగ్గర మోసపోయిన వారిలో ప్రవాస భారతీయులు కూడా ఉన్నారని డిసిపి అవినాష్ మహంతి ఆదివారం వెల్లడించారు. మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన షేక్ ఇర్షాద్ మహమ్మద్ తన స్నేహితుడైన కె రవికిరణ్‌తో కలసి యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఎక్స్‌లెంట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పేరుతో, రవికిరణ్ భార్య హిమబిందు శివాంగితో కలసి ఆర్బిట్ సొల్యూషన్స్ పేరిట సంస్థలు ఏర్పాటు చేశారు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే అధిక శాతం లాభాలు గడించొచ్చని నమ్మబలికి బంధువులు, స్నేహితులతోపాటు ప్రవాస భారతీయులను ఆకర్షించి 2013 నుంచి 2016 వరకు రూ. 20 కోట్ల మేర పెట్టుబడులు సేకరించాడు. ఈ ముగ్గురు ఓ రెస్టారెంట్‌తోపాటు ఏడు సంస్థలను ఏర్పాటు చేసి నిధులను వాటిలోకి మళ్లించారు. కాగా వీరు పెట్టుబడుల పేరుతో సేకరించిన నిధులతో స్థిర చరాస్తులు, ఖరీదైన కార్లు కొనుగోలు చేయడంతో పాటు విదేశాలకు టూర్లు వెళ్లి వచ్చేవారు. వీరి వద్ద నుంచి రూ. 8.05 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు మహమ్మద్ అఫ్రోజ్, మహమ్మద్ ఇమ్రోజ్, మహమ్మద్ రఫీలు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసును సిసిఎస్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇర్షాద్ మహమ్మద్ గత జూన్‌లో ఆస్ట్రేలియా పారిపోయాడు. కొన్ని రోజులు అక్కడే ఉండగా, స్నేహితులు గుర్తించడంతో గత్యంతరం లేక డిసెంబర్ 5న క్రిమినల్ కోర్టులో లొంగిపోయాడు. న్యాయస్థానం అనుమతితో ఇర్షాద్ మహమ్మద్‌ను సిసిఎస్ పోలీసులు మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు.