రాష్ట్రీయం

అమెరికాలో 40వేల మంది తెలుగు విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: అమెరికాలో వివిధ యూనివర్శిటీల్లో చదువుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య 40వేలకు చేరింది, అలాగే మన దేశం నుంచి మొత్తంగా అమెరికా వెళ్లి చదువుతున్న వారి సంఖ్య 2,06,582కు పెరిగింది. వీసా మంజూరు తదితర అంశాల్లో ఆంక్షలు పెరిగినా, వివిధ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య మాత్రం మరో 14శాతం పెరిగిందని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్సుమెంట్ సంస్థ సోమవారం ప్రకటించింది. వివిధ దేశాల నుండి అమెరికాలో ఎఫ్ వీసాపై 12లక్షల 30 వేల మంది చదువుతున్నారని, మరో 8697 మంది ఎం వీసాపై ఒకేషనల్ కోర్సులు చేస్తున్నారని పేర్కొంది.
ప్రపంచంలో వివిధ దేశాల నుండి వచ్చే వారిలో చైనా నుండి 3,78,986 మంది గరిష్టంగా ఉన్నారంది. భారత్ నుండి 2,06,582 మంది ఉన్నారని గతంతో పోలిస్తే ఈ సంఖ్య 14.1 శాతం ఎక్కువేనని గతంలో ఈ సంఖ్య 62,077 మాత్రమేనని అధికారులు వివరించారు. కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్‌లలో అత్యధికంగా విదేశీ విద్యార్థులున్నారని, ఎక్కువ మంది వ్యాపార కేంద్రాలుగా ఉన్న నగరాలనే ఎంచుకుంటున్నారని ఐసిఇ పేర్కొంది. భారత్ నుండి వచ్చిన వారిలో 83 శాతం మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమెటిక్స్(స్టెమ్) కోర్సుల్లోనే చేరుతున్నారని వివరించింది.